బ్రేకింగ్: ప్రభాస్ పెళ్లి డేట్ ఫిక్స్ అయిందట.. ఎప్పుడంటే?.

484

గత నాలుగేళ్లుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లివార్త మీడియాలో నానుతూనే ఉంది. పలుమార్లు ఈ ప్రశ్నకు బాహుబలి తర్వాత పెళ్లి చేసుకొంటానని ప్రభాస్ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి రిలీజై దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ప్రభాస్ సాహో చిత్ర షూటింగ్‌లో బిజీ అయిపోవడంతో పెళ్లి విషయం మళ్లీ వెనుకపడింది.తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లి వార్త మీడియాలో వైరల్ అవుతున్నది.

ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు వివరణ

ఇటీవల ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు యంగ్ రెబల్ స్టార్‌ పెళ్లిపై స్పందించారు. ప్రభాస్ త్వరలో పెళ్లి చేయడానికి చూస్తున్నాం. అమ్మాయి కోసం వెతుకుతున్నాం. పెళ్లి చేసుకొమని బలవంతం పెట్టడానికి ప్రభాస్ పిల్లాడేమి కాదు. తనకు చేసుకోవాలనుకొన్నప్పుడు అతడు చేసుకొంటాడు. పెద్దలుగా మేము సలహాలు ఇవ్వడం తప్ప మరొకటి ఉండదు అని అన్నారు.అయినా ప్రభాస్ పెళ్లిపై వార్తలు, రూమర్లు తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి. అనుష్క శెట్టితో ముడిపెడుతూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు సద్దుమణిగాయి. అనుష్క కూడా కెరీర్‌పై దృష్టిపెట్టింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇలాంటివన్నీ పక్కన పెడితే తాజాగా ప్రభాస్ పెళ్లి విషయంపై ఫ్యామిలీ సీరియస్‌గా ఉందట. ఒక సాహో సినిమా విడుదల కాగానే పెళ్లి చేసేద్దామని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ఓ పెళ్లి సంబంధం ఫిక్స్ అయినట్టు సమాచారం. పెళ్లి తేదీ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు.ఇదిలా ఉండగా, కెరీర్‌పరంగా ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చింది. 2019 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. 300 కోట్లతో బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.