తన ఇంటిని సీజ్ చేసిన KCR ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రభాస్

606

గ‌డిచిన రెండు రోజులుగా ప్ర‌భాస్ గెస్ట్ హౌస్ సీజ్ చేయ‌డం పై వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి.. ప్ర‌భుత్వ స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలు, అనుమతులు లేకుండా చేపట్టిన కట్టడాలపై అధికారులు మరోసారి దృష్టిసారించారు. ఈ స‌మ‌యంలో గ్రేటర్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపించారు. రాయదుర్గం సమీపంలో పైగా భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఇందులో భాగంగా అక్కడ ఉన్న నటుడు ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను కూడా అధికారులు సీజ్‌ చేశారు. రాయదుర్గం పైగా భూముల్లో సర్వే నంబరు 46లో 84.30 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంపై ప్రభుత్వం, స్థానిక వ్యక్తుల మధ్య 1954 నుంచి వివాదం కొనసాగుతోంది. ఇది హైకోర్టు దాకా వెళ్లడంతో మూడునెలల కిందట ఆ భూమి ప్రభుత్వానిదేనని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇక్కడ గతంలోనే పశువుల పాకలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. ఆ ప్రాంతంలోనే నే ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ కూడా ఉంది.

Image result for prabhas

కోర్టు తీర్పు వెలువరించినా ఎన్నికల నేపథ్యంలో అధికారులు కొన్నాళ్లు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టలేదు. తాజాగా సోమవారం శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర, సిబ్బంది ఆ స్థలంలోని పాకలు, ప్రహరీ గోడలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. ప్రభాస్‌‌కు సంబంధించిన గెస్ట్‌హౌస్ దగ్గర ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి తాళంవేసి సీజ్‌ చేశారు. ప్రభుత్వ స్థలమని పేర్కొంటూ అక్కడ నోటు ఏర్పాటుచేశారు. త్వరలోనే ఆ స్థలానికి రక్షణ ఏర్పాట్లు చేస్తామని అధికారులు వెల్లడించారు.దీంతో హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు తన ఇంటిని సీజ్ చేయడంపై హైకోర్టులో ప్రభాస్ పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీర్పుపై ప్రభాస్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించనుంది.

Image result for prabhas

రాయదుర్గంలోని పాన్ మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టులో ఉన్న కేసులు తొలగిపోవడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో ప్రభాస్‌ ఇల్లు ఉండటంతో దాన్నీ సీజ్‌ చేశారు. ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందుతుందని మాల రాములు, నీరుడు లక్ష్మయ్య కోర్టును ఆశ్రయించారు. వీరి నుంచి కొంత భూమి కొనుగోలు చేసిన శివరామకృష్ణ అనే వ్యక్తి కూడా కోర్టుకు వెళ్లారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వీరి వాదనలు విన్న న్యాయస్థానం బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. భూమిని ఫిర్యాదుదారుల పేరుపై పట్టా చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ అప్పటి తహసీల్దార్‌ పట్టా చేయకపోవడంతో శివరామకృష్ణ మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో తహసీల్దార్‌కు కోర్టు ధిక్కారణ శిక్ష విధించింది. ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు కేసు కొట్టేసింది. దీంతో ఆ స్థలంలో ఉన్న భవంతులను అధికారులు సీజ్ చేశారు. అందులోనే ప్రభాస్ ఇల్లు కూడా ఉండడంతో దాన్ని కూడా సీజ్ చేసి నోటీసులు అంటించారు.