కేరళ వరద బాదితులకు కోటి రూపాయలు విరాళం ఇచ్చిన బాహుబలి ప్రభాస్..

333

 

భారీ వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ ప్రజల కోసం పలువురు సినీ స్టార్లు తమ వంతు సహాయం అందించారు. కమల్ హాసన్, సూర్య, విజయ్ దేవరకొండ, కార్తి తదితరులు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. హీరో విశాల్‌ ‘కేరళ రెస్క్యూ’ పేరుతో అత్యవసర వస్తువులను సేకరించి బాధితులకు అందించే ప్రయత్నంలో ఉన్నారు.

 

Image result for kamal surya karthi

దీనిపై స్పందించిన కమల్ హాసన్ రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. తమిళ స్టార్లు సూర్య, కార్తి కలిసి రూ. 25 లక్షలు ప్రకటించారు. తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ తన వంతుగా రూ. 5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు.అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేరళ వరద బాధితులకు తన వంతుగా రూ.25 లక్షలు దానం చేశారు.

prabhas

తాజగా బాహుబలి హీరో ప్రభాస్ కోటి రూపాయలను విరాళంగా ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.ప్రజలు సంతోషంగా ఉంటేనే మేము కూడా హ్యాపీగా ఉంటామని ప్రభాస్ చెప్పాడు.