ఆగ‌స్టులో ప్ర‌భాస్ సినిమా గ్రాండ్ లాంచ్

391

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు కొత్త సినిమాలు కాకుండాసెట్స్ పై ఉన్న సాహూ పైనే దృష్టిపెట్టారు..బాహుబ‌లి స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న సినిమా సాహూ.. ఇక ఈ సినిమా పై అనేక వార్త‌లు ఇప్ప‌టికే వినిపిస్తున్నాయి..ఈ సినిమాలో ప్ర‌భాస్ రోల్ ఎలా ఉండ‌బోతోందా అని ఇటు అభిమానులు కూడా ఎంతో ఉత్సుక‌త‌తో ఉన్నారు.

Image result for saho images

రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న సాహో షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇక ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ నటిస్తుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే త‌ర్వాత ప్రభాస్ జిల్ సినిమా ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేయ‌నున్నారు..

Image result for saho images

ఈ సినిమా ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో ఉంటుంద‌ని తెలుస్తోంది.. ఈ చిత్రం ఆగ‌స్టు మొద‌టి వారం గ్రాండ్ గా లాంచ్ చేయాల‌ని చూస్తున్నారు..ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కూ యూర‌ప్ లో తీయ‌నున్నారట‌.. ఇక చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టించ‌నున్నారు… ఇక ఈ సినిమా పై ఇప్ప‌టికే ప్ర‌భాస్ అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.. ఇందులో ప్ర‌భాస్ ఎలా క‌నిపించ‌నున్నారా అని, ఇటు సాహూ త‌ర్వాత ఈ సినిమాపై మ‌రింత అంచ‌నాలు పెరిగిపోతాయ‌న‌డంలో సందేహాం లేదు.