బాలీవుడ్‌ లోకి ప్రభాస్ ఎంట్రీ ఫిక్స్….భారీ మల్టీ స్టారర్ సినిమాలో ప్రభాస్..

454

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ సినిమాతో బాలీవుడ్ హీరోలకు తీసిపోడు అన్న విదంగా అతని స్థాయి పెరిగింది.ప్రభాస్‌ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.అయితే ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీపై కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

బాహుబలి సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్‌ చేసిన కరణ్‌ జోహర్‌, ప్రభాస్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.ఆ వార్తలు ఇప్పుడు నిజం కాబోతున్నాయని మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.అయితే అతను సింగిల్ హీరోగా కాకుండా ఒక మల్టీ స్టారర్‌ సినిమాతో పరిచయం అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్‌ యంగ్ హీరో రణవీర్‌ సింగ్‌ తో కలిసి ఓ మల్టీస్టారర్‌ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్‌.ప్రస్తుతం ప్రభాస్‌, రణవీర్‌లో ఇప్పటికే కమిట్‌ అయిన ప్రాజెక్ట్స్‌ తో బిజీగా ఉండటంతో ఈ మల్టీస్టారర్‌ 2019లో సెట్స్‌మీదకు వెళ్లనుందట.అయితే ఈ విషయంపై ప్రభాస్‌ నుంచి గాని కరణ్‌ జోహర్‌ నుంచిగాని ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.