‘టాక్సీవాలా’‌ పైరసీ విషయంలో విజయ్‌కి అండగా నిలిచిన ప్రభాస్

267

విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం టాక్సీవాలా.ఈ చిత్రంలో విజయ్ కు జోడిగా తెలుగమ్మాయి ప్రియాంక జువాల్కర్ నటించింది.
యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రేపు (నవంబర్ 16) విడుదల కానుంది.ఈ చిత్రానికి హారర్ అండ్ థ్రిల్లింగ్ జానర్‌లో రాహుల్ సాంక్రిత్యన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలిచిత్రం.

Image result for taxiwala movieఇక ఈ మూవీ విడుదలకు ముందే సినిమా మొత్తాన్ని ఆన్‌లైన్‌లో లీక్ చేశారు లీక్ రాయుళ్లు. అయినప్పటికీ సినిమాపై ఉన్న నమ్మకంతో రెట్టించిన ఉత్సాహంతో శనివారం నాడు ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. వీరికి అండగా నిలుస్తూ.. టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు తమ వంతు సాయం అందిస్తూ.. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు.ఇప్పటికే నిఖిల్ వరుణ్ తేజ్ ఈ సినిమాకు సపోర్ట్ ఇవ్వగా ఇప్పుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా సపోర్ట్ గా నిలిచారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘టాక్సీవాలా’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ.. చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేపు ‘టాక్సీవాలా’ థియేటర్స్‌ వస్తుంది. ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దు. థియేటర్స్‌లో మాత్రమే ఈ సినిమాని చూడండి’ అంటూ అభిమానులకు విజ్ఞ‌ప్తి చేశారు.