‘RRR’ ప్రారంభోత్సవానికి సర్‌ప్రైజ్ గెస్ట్…..గెస్ట్ లుగా ఎవరు వస్తున్నారో తెలుసా..

275

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్ర #RRR కు రంగం సిద్ధం అవుతోంది.డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించబోతున్నాడు.గత కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ కాంబినేషన్(RRR) మొత్తానికి పట్టాలెక్కుతోంది.

Related image

ఈ మల్టీస్టారర్‌ను నవంబర్ 11న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 11వ తేదీన ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమంతో ఈ సినిమాను ప్రారంభించనున్నారు.ఇదిలా ఉంటే, ఈ మూవీ ఓపెనింగ్‌కు ప్రత్యేక అతిథి వస్తున్నారనే వార్త ఇప్పుడు సినీ పరిశ్రమలో వినిపిస్తోంది.

Related image

‘బాహుబలి’ హీరో, రాజమౌళి అత్యంత ఇష్టపడే వ్యక్తి ప్రభాస్.. ‘RRR’ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని అంటున్నారు. ప్రభాస్ పూజా కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్, రాంచరణ్‌పై తొలి క్లాప్ కొడతారని తెలుస్తోంది. ప్రభాస్‌తో పాటు రానా, అనుష్కను కూడా రాజమౌళి ఆహ్వానించారని టాక్.