జయలలిత బయోపిక్ కు దర్శకుడు కన్ఫర్మ్..!

366

అలనాటి మేటి నటి తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ గురించి ఇప్పటి వరకు ఎన్నో కధనాలు వెలువడుతున్నాయి..అయితే ఈ సినిమాకు సంబంధించి ఖచ్చితమైన తాజా సమాచారం ఒకటి వెలువడింది..ఈ సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకుడిగా తెరకేక్కిస్తారని తాజా సమాచారం..

తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను విబి మీడియా పతాకంపై విష్ణు ఇందూరి నిర్మించనున్నారు..ఈయన ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ బయోపిక్ అలాగే కపిల్ దేవ్ బయోపిక్ ’83’ చిత్రాలను నిర్మిస్తుండడం విశేషం. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది జయలలిత పుట్టిన రోజు ఫిబ్రవరి 24 న లాంచ్ కానుంది. మరి ఈచిత్రంలో జయలలిత పాత్రకు ఎవరిని తీసుకుంటారో చూడాలి.