ఎన్నికల బరిలో నిలబడుతున్న ఎన్టీఆర్..

318

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల బరిలో నిలపబోతున్నారా? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. అయితే రియల్ లైఫ్‌లో కాదులెండి… రీల్ లైఫ్‌లో.ప్రస్తుతం ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అరవింద సమేత సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Image result for aravinda sametha

ఈ సినిమాను రాధాకృష్ణ (చినబాబు)నిర్మిస్తున్నాడు.పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.నాగబాబు జగపతిబాబు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో భారీ పొలిటికల్ ఎపిసోడ్ కూడా ఉంటుందని సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను త్రివిక్రమ్ ఎన్నికల బరిలో కూడా నిలుపుతారనే ప్రచారం జరుగుతోంది.

Image result for aravinda sametha working stills

ఎన్టీఆర్ హావభావాలు, ఎన్నికల ప్రసంగాలను అధ్యయనం చేసిన త్రివిక్రమ్ భారీ పొలిటికల్ ఎపిసోడ్ కూడా పెట్టాడని సమాచారం. ఓవైపు సినిమా షూటింగ్ నిర్వహిస్తూనే మరోవైపు నిర్మాణాంతర పనులపై దృష్టి పెట్టింది చిత్రబృందం.దసరాకు ఈ సినిమాను తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నిస్తుంది.