షాక్: సామ్రాట్ పై మళ్ళి కేసు నమోద్ చేసిన పోలీసులు.. అసలేమైంది?

496

బిగ్‌బాస్‌ ఇంట్లో ఉన్న సభ్యులకు కోర్టు కేసులు చాలా కామన్‌. హిందీ బిగ్‌బాస్‌లో కేసుల కారణంగా పలువురు పలు సార్లు బయటకు వెళ్లి, కోర్టుకు హాజరు అయ్యి మళ్లీ లోనికి వచ్చిన సందర్బాలున్నాయి. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌లో కూడా అదే కనిపిస్తుంది. మొదటి సీజన్‌లో డ్రగ్స్‌ కేసులో ఉన్న ముమైత్‌ ఖాన్‌ను ఒక్క రోజు పాటు బయటకు తీసుకు వెళ్లి మళ్లీ ఇంట్లోకి తీసుకు వచ్చారు. బయటకు వచ్చిన సమయంలో ఆమె విచారణ అధికారుల వద్ద మాట్లాడటం, ఆ వెంటనే మళ్లీ బిగ్‌బాస్‌ ఇంటికి వెళ్లడం జరిగింది. ఇక రెండవ సీజన్‌లో కూడా అదే జరిగింది.యువ నటుడు సామ్రాట్‌ బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి గురువారం బయటకు వచ్చాడు. కోర్టు కేసు కారణంగా మీరు వెళ్లి సాయంత్రం వరకు రావచ్చు అంటూ బిగ్‌బాస్‌ కన్ఫెషన్‌ రూంకు పిలిచి చెప్పడం జరిగింది.అయితే ఆరోజు కోర్ట్ కు వెళ్ళిన సామ్రాట్ కు కోర్ట్ దగ్గర ఒక చేదు అనుభవం ఎదురైంది.మరి అదేమిటో తెలుసుకుందామా.

Image result for samrat reddy serious face

కోర్టు నోటీసు రావడంతో సామ్రాట్‌ వెళ్లడం, రావడం జరిగిపోయింది.ఇంతకు సామ్రాట్‌ ఎటు వెళ్లి ఉంటాడు, ఈయనకు వచ్చిన కోర్టు నోటీసు ఏంటీ అంటూ కొందరు ఆలోచిస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే సామ్రాట్‌ భార్య హర్షిత రెడ్డి కొంత కాలం క్రితం కేసు నమోదు చేసింది. తన భర్త తన ఇంట్లోకి జొరబడి తనపై దాడి చేయడంతో పాటు, ఇబ్బంది పెట్టాడు అంటూ కేసు పెట్టడం జరిగింది. దాంతో పాటు ఆమె విడాకులకు కూడా దరకాస్తు చేసుకుంది. ఆ కారణంగానే ఇప్పుడు సామ్రాట్‌ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.

Image result for samrat reddy at police station

నాంపల్లి ఫ్యామిలీ కోర్టులో సామ్రాట్‌ తన వాదనలు వినిపించి కేవలం నాలుగు గంటల్లోనే మళ్లీ ఇంట్లోకి వచ్చేశాడు.అయితే కోర్ట్ దగ్గర జరిగిన ఒక విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.కోర్ట్ దగ్గర ఏం జరిగింది అంటే..విడాకుల కేసు విషయం మీద హర్షిత రెడ్డి ఆమె ఫ్యామిలీ తో కలిసి వచ్చింది.అదే విధంగా సామ్రాట్ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు.అయితే కోర్ట్ ఆవరణలో సామ్రాట్ మీద హర్షిత రెడ్డి కుటుంబ సభ్యులు కొంచెం దుర్భాషలాడినారు.

సామ్రాట్ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నా కూడా హర్షిత రెడ్డి బ్రదర్ సామ్రాట్ మీద చెయ్యి చేసుకోవాలని చూశాడు.ఆ కోపంలో సామ్రాట్ హర్షిత రెడ్డి బ్రదర్ మీద చెయ్యి చేసుకున్నాడు.ఆ గొడవ తర్వాత ఇక సామ్రాట్ ఎక్కువ సమయం బయట ఉండకుండా మళ్ళి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు.హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలోనే ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌ సెట్‌ వేయడం వల్ల సామ్రాట్‌కు ఎక్కువ సమయం పట్టలేదు.అయితే ఆ తర్వాత హర్షిత రెడ్డి బ్రదర్ సామ్రాట్ మీద మళ్ళి కేసు నమోద్ చేసినట్టు తెలుస్తుంది.మరి ఆ కేసు ఎంతతివరకు వెళ్తుందో చూడాలి.మరి కోర్ట్ దగ్గర జరిగిన ఇష్యు గురించి అలాగే ఇలా వరుసగా సామ్రాట్ ఎదుర్కొంటున్న కేసుల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.