రాజమౌళి కొడుకు పెళ్లిలో ప్రభాస్-అనుష్క చేసిన పని చూసి షాకైన ఎన్టీఆర్,రామ్ చరణ్

524

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంతా సిద్ధమైంది. జగపతి బాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌తో కొద్ది నెలల క్రితం కార్తికేయ వివాహ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహం డిసెంబర్ 30 ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి ఫ్యామిలీ జైపూర్‌కు చేరుకొన్నారు. కార్తీకేయ, పూజా ప్రసాద్‌తోపాటు ఇరువర్గాల బంధువులు, కుటుంబ సభ్యులు జైపూర్ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. తెలుగు సినీ ప్రముఖుల రాకతో జైపూర్ కోలాహాలంగా మారింది. కార్తీకేయ, పూజా వివాహం జైపూర్‌లోని విలాసవంతమైన హోటల్ జరుగనున్నది. పింక్ సిటీకి సమీపంలోని కుకాస్ అనే ఫైవ్ స్టార్ హోటల్‌లో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వివాహానికి భారతీయ సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు హాజరుకానున్నారు.

Image result for prabhas and anushka

ఇప్పటికే ఈ వివాహం కోసం ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, చరణ్, నాని,నాగార్జున, ఎన్టీఆర్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు తమ కుటుంబాలతో సహా జైపూర్‌కు చేరుకొన్నారు. ఇంకా కొంత మంది ఆదివారం అక్కడికి చేరుకొనే అవకాశం ఉంది. ప్రభాస్-అనుష్క కూడా మిగతా హీరోల కంటే ముందే జైపూర్ వెళ్లిపోయారు. సాయంత్రం హోటల్ కు చేరుకున్న చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ అందరికీ ప్రభాస్, అనుష్క, రాజమౌళి స్వయంగా స్వాగతం పలికారు. నాగార్జున, నాగచైతన్య కుటుంబాలు రేపు జైపూర్ వెళ్లనున్నారు. మరికొంతమంది ప్రముఖులతో పాటు చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్లు రేపు సాయంత్రం అక్కడికి చేరుకుంటారు. రేపు సంగీత్ ఉంటుంది. ఎల్లుండి గ్రాండ్ గా పెళ్లి జరగనుంది.

అయితే ఈ పెళ్లి సంగతేమో కాని పెళ్ళిలో అనుష్క ప్రభాస్ కలిసి చేస్తున్న పనులు మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. వీళ్ళిద్దరూ కలిసి మిగతా వాళ్ళను ఒక ఆట ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కలిసి మిగతా హీరోల వస్తువులు దాచిపెట్టి వాళ్ళను ఏడిపిస్తున్నారంట. అంతేకాకుండా రాజమౌళి ఒక స్టేజ్ వేయించి అందరితో స్కిట్స్ లాంటివి చేపిస్తున్నారంట. ఇప్పటికే ప్రభాస్ కీరవాణి ఎన్టీఆర్ చేసిన స్కిట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.అయితే తర్వాత అనుష్క కూడా ప్రభాస్ తో కలిసి ఒక స్కిట్ చేసిందంట. అది చాలా ఎమోషనల్ గా ఉండే లవ్ స్కిట్. అది చుసిన అతిధులు అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారంట.అయితే మా మధ్య ప్రేమ లేదని ఈ ఇద్దరు చెబుతున్నారు. కానీ ఈ స్కిట్ చుసిన ఎవరికైనా సరే వీరి మధ్య ఉన్నది ప్రేమే అని అనిపించకుండా ఉండదంట.అంతా బాగా చేశారంట స్కిట్.మరి ఈ వీడియో ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. అనుష్క ప్రభాస్ చేసిన ఈ లవ్ స్కిట్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.