బిగ్ బాస్ చెప్పిన వెంట‌నే ఒప్పేసుకున్న పూజా షాకైన బిగ్ బాస్ స‌భ్యులు

476

బిగ్ బాస్ హౌస్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది…ఛాన్స్ టు టాక్‌లో భాగంగా హౌస్‌లో టెలిఫోన్లు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇవ్వగా.. బుధవారం నాటి ఎపిసోడ్‌లో గీతా మాధురి, బాబు గోగినేనిలు టెలిఫోన్‌లో సంభాషణలు జరిపారు. గీతా మాధురి తన భర్త నందుతో మాట్లాడగా.. బాబు గోగినేని తన భార్యతో మాట్లాడారు. యాంకర్ దీప్తి నల్లమోతు తన భర్తతో మాట్లాడారు. అమిత్ తన భార్య, పిల్లలతో ముచ్చటించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. మరో కంటెస్టెంట్ తనీష్ తన తల్లితో మాట్లాడారు.

Image result for telugu big boss phone call

స్మిమ్మింగ్ ఫూల్‌లో చేపలా ఈదేసిన పూజా… బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా ఛాన్స్ టు టాక్ మీటర్‌లో రీచార్జ్ చేయడానికి బిగ్ బాస్ హౌస్‌కి వైల్డ్ కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్‌కి రెండో టాస్క్‌ కంప్లీట్ చేయాల్సిందిగా స్విమ్మింగ్ ఫూల్‌ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం స్విమ్మింగ్ ఫూల్‌కి దిగిన పూజా రామచంద్రన్‌ ఫుల్ ఎనర్జీతో తనకు ఇచ్చిన టాస్క్‌ను కంప్లీట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ టాస్క్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేయడంతో తనీష్, దీప్తి, అమిత్‌లు ఫోన్‌లో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోగలిగారు.

Image result for Big boss puja ramachandran
సునైనా, గణేష్, నందినిలకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్..ఛాన్స్ టు టాక్‌లో భాగంగా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోయిన దీప్తి సునైనా, గణేష్, నందినిలకు ఫోన్‌ మాట్లాడేందుకు మరో ఛాన్స్ వారు ఊహించ‌నంత‌గా ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఇందుకోసం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని మెలిక పెట్టడంతో ఆ త్యాగాలను ఏంటి? వాటికి వాళ్లు ఒప్పకున్నారా? లేదా? అనేదినేటి ఎపిసోడ్ వ‌ర‌కూ వేచిచూడాలి .

ఇక పూజాకు చెప్పిన వెంట‌నే స్విమ్మింగ్ పూల్ లోకి దిగ‌డం టాస్క్ చేయ‌డం, అలాగే 50 కాయిన్స్ తీయ‌డం తో అక్క‌డ హౌస్ లో ఉన్న స‌భ్యులు కూడా షాక్ అయ్యారు… పూజా చాల ఎన‌ర్జిటిక్ అండ్ స్పోర్టీవ్ అని మాట్లాడుకున్నారు.. ఇటు ప్రేక్ష‌కులు కూడా పూజా చేసిన ప‌నికి ప్ర‌శంస‌లు ఇస్తున్నారు..స్విమ్మింగ్ ఫూల్‌లో చేసిన టాస్క్ కై ప్రేక్ష‌కులు ఆమెకు కామెంట్లు పాజిటివ్ బూస్టింగ్ ఇస్తున్నారు. మ‌రి నేటి షోలో ఎటువంటి ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు జ‌రుగుతాయో చూడాలి.