పాపం తన సోదరుడు ఏం చేసాడో తెలిసి కుమిలిపోతున్న పాయల్ రాజ్ పుత్

315

కుర్ర‌కారుని మ‌త్తెక్కించే అందాల‌తో త‌న అభిన‌యంతో ఆక‌ట్టుకుంది పాయ‌ల్ రాజ్ పుత్.. ఈ అందాల భామ ఈ సినిమాతో త‌న పేరుని మ‌రింత తెలుగునాట గుర్తు ఉండేలా చేసుకుంది..పాయల్ రాజ్‌పుత్. అనే ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “ఆర్ఎక్స్ 100” మూవీలో తన అందాల ఆరబోతతో కుర్రకారు హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంది. కానీ, పాయల్ రాజ్‌పుత్ గుండెల నిండా బాధను పెట్టుకుని జీవిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించిందీ భామ. సాధారణ ప్రజలకు ఉన్నట్టుగానే ఈమెకు కష్టాలు ఉన్నాయి. ఆ బాధ, కష్టంతో రాజ్‌పుత్ గడుపుతోంది. ఇంతకీ ఆమెకు వచ్చిన కష్టమేంటో ఓసారి తెలుసుకుందాం.

Image result for payal rajput

ఈ హీరోయిన్‌కు ధృవ్ రాజ్‌పుత్ అనే సోదరుడు ఉన్నాడు. ఈయన గత మూడేళ్ళ క్రితం ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. 25 సంవత్సరాల వయసున్న ఇతను 27 మార్చి 2016 నుంచి కనిపించటం లేదు. ఇదే అంశంపై పాయల్ ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించి, షేర్ చేసింది. ఇదే విషయంపై ముంబై పోలుసులకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి ఫలితం లేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ నేపథ్యంలో ఆదివారం ధృవ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె చేసిన ట్వీట్‌లో… ‘నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా గడవటం కష్టంగా ఉంది ధృవ్. నువ్వు తిరిగి వస్తావని ఆశిస్తున్నాం. ఈ రోజు నీ పుట్టిన రోజు. ఆ దేవుడు నీకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. నువ్వు మిస్ అయ్యాక అమ్మానాన్నలు చస్తూ బతుకుతున్నారు. ఎంతో బాధ పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సందేశం నీకు అందుతుందని భావిస్తున్నా. ఒకవేళ నువ్వెక్కడైనా అనుకోని ఆపదలో చిక్కుకొని ఉంటే.. మాకు కాల్ చెయ్. నీ కోసం మేము ఎదురు చూస్తున్నాం సోదరా’ అంటూ పాయల్ రాజ్‌పుత్ పేర్కొంది.మ‌రి అత‌ని సోద‌రుడు ఆమెకు త్వ‌ర‌గా దొర‌కాలి అని కోరుకుందాం. మ‌రి దీనిపై మీరు కూడా కామెంట్లను అలాగే ఆమె ట్వీట్ ని షేర్ చేయండి.