ఎన్టీఆర్ బయోపిక్ లో ఛాన్స్ కొట్టేసిన RX100 బ్యూటీ.. ఎవరి పాత్రలోనో చూడండి

276

మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ .క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related image

ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు.షూటింగ్ శరవేగంగా జరపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అయితే ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన ఓ సంచలన వార్త తాజాగా ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.రామారావు సినీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను ఫోకస్ చేసే క్రమంలో అప్పట్లో ఆయనతో కలిసి నటించిన పలువురు హీరోయిన్ల పాత్రను సైతం ఇందులో చూపించనున్నారు. శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్ సింగ్, సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ ఇప్పటికే ఎంపికన సంగతి తెలిసిందే.

Related image

ఇప్పుడు ఈ చిత్రంలో ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్‌ పాయల్ రాజ్‌పుత్‌ను ఓ కీలకమైన పాత్రకు ఎంపిక చేశారట.ఎన్టీఆర్ సినీ జీవితంలో మరో ముఖ్యమైన నటి జయసుధ. ఈ పాత్ర కోసం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి … పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.