యంగ్ హీరో ప‌క్క‌న ఛాన్స్ కొట్టిన Rx- 100 బ్యూటీ

615

అర్జున్ రెడ్డి ఓవ‌ర్ నైట్ లో ఎలా ఫేమ్ తెచ్చుకుందో ఇప్పుడు టాలీవుడ్ లో ఆర్ ఎక్స్ 100 సినిమా అంతే రేంజ్ ఫేమ్ తెచ్చుకుంది.. చిన్న సినిమా అయినా క‌లెక్ష‌న్ క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తోంది.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చింది.. ఆమె న‌ట‌న‌కు ఫిదా అవుతున్నారు అంద‌రూ..ఆమె ఓవ‌ర్ నైట్ లోనే సెన్సేష‌న్ గా మారింది.

Image result for bellamkonda srinivas

హీరోయిన్ పంజాబీ నటి పాయల్ రాజపుత్. ఈ చిత్రం లో గ్లామర్ తో మాత్రమే కాకుండా నటనతో నూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం తరువాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయట.యువ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 5వ చిత్రంలో రెండవ హీరోయిన్ గా పాయల్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది..

Image result for payal rajput

ఈ సినిమాకు కొత్త ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు….ఈ చిత్రంలో ప్రముఖ నటి కాజల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నిల్ నితిన్ ముఖేశ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు…భారీ తారాగ‌ణంతో వ‌స్తున్న ఈ సినిమాలో పాయ‌ల్ రాజ్ పుత్ ఫిక్స్ అయింది అనే వార్త ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.