సైరా సినిమా చూసి పవన్ కళ్యాణ్ ఏమన్నాడో చూడండి

157

మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఏపీ తెలంగాణ‌లోనే కాదు భార‌త‌దేశ సినిమా చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టే సినిమాగా ప్ర‌ద‌ర్శించ‌బడుతోంది….సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. ట్విట్టర్‌లో అయితే ఈరోజు ‘సైరా’దే హవా. మొత్తం మీద రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా భావించిన నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయం అని అంటున్నారు, ఇక ఈ ఏడాది మేటి అవార్డులు అన్నీ సైరా సంపాదిస్తుంది అని చెబుతున్నారు.

Related image

ఇక మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఈ సినిమాపై నేరుగా చ‌ర‌ణ్ చిరంజీవికి ఫోన్ చేసి ప్ర‌సంశించారట‌.. సినిమా అదిరిపోయింద‌ని అన్న‌య్య న‌ట‌న మ‌రోసారి తెర‌పై చూడాలి అనే కోరిక మ‌రింత పెరిగేలా చేస్తోందని అన్నార‌ట. ఇంత భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కించ‌డం గ్రేట్, చ‌ర‌ణ్ నువ్వు పెద్ద సాహ‌సం చేసి స‌క్సస్ అయ్యావు అని చెప్పార‌ట‌, దీంతో మ‌రిన్ని మంచి చిత్రాలు నువ్వు నిర్మాత‌గా చేయ్యాల‌ని అన్నార‌ట‌.

Image result for sye raa and pawan kalyan

అలాగే సినిమాలో చిరంజీవిని చూస్తుంటే నిజంగా ఉయ్యాల‌వాడ‌ని చూసిన‌ట్లు ఆరోజుల్లో జ‌రిగిన చ‌రిత్ర‌ని అద్బుతంగా చూపించార‌ని అన్న‌య్య మ్యాన‌రిజం ఆ చ‌రిత్ర‌లో రేనాటి సూరీడులా క‌నిపించింది అని ప‌వ‌న్ కొనియాడారు అని తెలుస్తోంది.
అలాగే సైరా’ సినిమాపై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. చిరంజీవినైతే ఆకాశానికి ఎత్తేశారు. ‘‘శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి పరకాయ ప్రవేశం చేశారు. చరిత్రలో కనుమరుగైన నిప్పులాంటి కథను ఆయన వెలికితీశారు. జగపతిబాబు గారు. కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా.. ఇలా ప్రతి పాత్ర కథలో భాగంగా రావడమే కాకుండా పరస్పరం ముడిపడి ఉన్నాయి’’ అని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఇంత గొప్ప సినిమాను నిర్మించిన రామ్ చరణ్‌కు, దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డికి రాజమౌళి అభినందనలు తెలిపారు. ఇంత పెద్ద విజయానికి వీరిద్దరూ అర్హులంటూ పేర్కొన్నారు. రాజమౌళి ప్రశంసలతో చిత్ర యూనిట్‌తో పాటు మెగా అభిమానులకు కొత్త ఉత్సాహం వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్ ద్వారా రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపింది. ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శంస‌లు ఆయ‌న అభిప్రాయం సినిమాపై చెప్ప‌డంతో మెగా అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు.