తన భర్త ప్రణయ్ గుర్తుగా పవన్ కళ్యాణ్ అమృతకు అందిస్తున్న కానుకను చూసి బోరున ఏడ్చేసిన అమృత

525

ఈ మధ్య కాలంలో జరిగిన అతికిరాతక ఘాతుకం ఏదైనా ఉందంటే అది మిర్యాలగూడ పరువు హత్య అనే చెప్పుకోవాలి.ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అల్లుడిని చంపించాడు ఒక కిరాతక మామ.ఈ ఘటన మీద రెండు తెలుగు రాష్టాలలో పెద్ద చర్చనే నడించింది.కులం అనే పెనుభూతం మీద చాలా మంది చాలా రకాలుగా స్పందించారు.అయితే ఈ ఘటన గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రణయ్ గుర్తుగా అమృతకు ఒక కానుక ఇవ్వబోతున్నాడు.మరి ఏమి ఇస్తున్నాడో చూద్దామా.

Image result for pawan kalayan

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తండ్రి కుల దురహంకారం కారణంగా భర్తను పోగొట్టుకున్న అమృత ప్రణయ్ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతోంది భార్య అమృత.కన్న తండ్రే తన పసుపు కుంకాలు తీయటాన్ని జీర్ణించుకోలేకపోతుంది.అమృత తండ్రి మారుతీరావు, ఇతరులు పోలీసుల అదుపులో ఉన్నారు.అయితే తన తండ్రిని ఉరి తీయాలని అమృత అంటుంది.ఒకవేళ శిక్ష పడకుంటే బయటకు వచ్చి తనకు పుట్టబోయే బిడ్డను చంపేస్తారని ఆమె తన ఆవేదనను వ్యక్తపరుస్తుంది.కులవివక్షతపై పోరాటం చేస్తానని తెలిపిన అమృత ఓ మంచి భాగస్వామి దొరికాడనుకుంటున్న సమయంలో ఎక్కువ రోజులు ఉండనివ్వలేదని కన్నీరు పెట్టుకున్నారు. తనతో ఏ పని చేయించేవాడు కాదని.. అప్పుడే పుట్టిన బిడ్డ కంటే కూడా బాగా చూసుకునేవాడని ప్రణయ్‌తో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Image result for pranay and amrutha

చనిపోయిన రోజు కూడా… తనను నిద్రలేపి.. భోజనం చేయించి.. హాస్పిటల్‌కు తీసుకువచ్చాడని చెప్పారు. అత్తమామలు కూడా తనను బాగా చూసుకునేవారని తెలిపారు.న్యాయం కోసం సామాజిక మాధ్యమం వేదికగా ఉద్యమాన్ని ఆరంభించింది. హత్యకు గురైన భర్త పేరుతో ‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీని సృష్టించింది. ‘ప్రణయ్‌ ఇప్పుడు ఒంటరి కాదు. నాతోపాటు కోట్ల మంది గుండెల్లో బతికే ఉన్నాడు’ అంటూ అమృత తొలి పోస్టు చేసింది.మిర్యాలగూడ సెంటర్‌లో ప్రణయ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది అమృత.దానికి ప్రభుత్వ పర్మిషన్ అడిగింది.అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమె కోరికను తీరుస్తా అని చెప్పాడు.అమృతకు మాట ఇస్తూ ప్రణయ్ విగ్రహాన్ని మిర్యాలగూడ నడిబొడ్డున పెట్టిస్తా అని చెప్పాడంట.అలాగే ప్రణయ్ చావుకు కారణమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడేంతవరకు మనం పోరాటం చెయ్యాలని అభిమానులకు చెప్పాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నీకు మేమంతా ఉన్నాం అనే భరోసా అమృతకు అందరు ఇవ్వాలని పవన్ ఈ సందర్భంగా అందరిని కోరాడు.అంటే త్వరలోనే అమృత కోరిక తీరబోతుందన్నమాట.ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు కదా.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ప్రణయ్ హత్య గురించి దాని వెనుక ఉన్న కుల వివక్ష గురించి అలాగే అమృత చేసిన విగ్రహ డిమాండ్ గురించి దానిని నెరవేరుస్తా అన్న పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.