హరి కృష్ణ చనిపోయాడని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఏం చేసాడో చూడండి

450

సినీ, రాజకీయ రంగంలో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.హైదరాబాద్‌ నుంచి నెల్లూర్ వెళ్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారని సమాచారం.

Image result for harikrishna nandamuri car accident images

ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.అయితే హరికృష్ణ మృతికి పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు.అయితే ఈ సందర్భంగా పవన్ తీసుకున్న ఒక నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది.మరి పవన్ తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకుందామా.హరికృష్ణ మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.హరికృష్ణ మరణం అటు రాజకీయ నాయకులను ఇటు సినీ ప్రముఖులను కలచివేస్తుంది.చాలా మంది ప్రముఖులు హరికృష్ణ నివాసానికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.హరికృష్ణ నివాసానికి సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.ఇప్పటికే నందమూరి కుటుంబం మొత్తం ఆయన ఇంటికి చేరుకున్నారు.అలాగే సినీ పెద్దలు కొంతమంది హరికృష్ణ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.హరికృష్ణ మృతిపట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Image result for pawan kalyan depression images

హరికృష్ణ మృతి పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.హరికృష్ణ గారి మరణం తీరని లోటని వారు వ్యాఖ్యానించారు.హరికృష్ణ అకాల మరణం దురదృష్టకరమని పవన్ వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన మరణాన్ని తట్టుకునే శక్తి నందమూరి కుటుంబానికి రావాలని పవన్ కళ్యాణ్ ఆశించారు. బుధవారం జనసేన పార్టీ అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ఎక్కడ పార్టీ కార్యకలాపాలు జరగవు ఎలాంటి మీటింగ్స్ జరగవని ఆయన తెలిపారు.హరికృష్ణ గారికి మనం ఇచ్చే నివాళి ఇదే అని జనసేన కార్యకర్తలకు చెప్పాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీనిని అందరు పాటించాలని జనసేన కార్యకర్తలను కోరాడు.అయితే పవన్ తీసుకున్న నిర్ణయం మీద పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చనిపోయిన హరికృష్ణ జనసేన పార్టీ నాయకుడు కాదు కానీ ఆయన మీద ఉన్న గౌరవంతో పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరికి ఆశ్చర్యపరచింది.పవన్ అంటే ఇదే అని ఆయన అభిమానులు కార్యకర్తలు అనుకుంటున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. హరికృష్ణ మృతి గురించి అలాగే జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ హరికృష్ణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం గురించి ఆయన తెలిపిన సంతాపం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.,