నటి ఝాన్సీ చనిపోయే ముందు ప్రియుడు ఝాన్సీని ఏం చేసాడో తెలిస్తే షాక్ !

244

వెండితెర బుల్లితెర మీద నటించి మనల్ని అలరించే నటీనటులు వివిధ కారణాల వలన ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు వర్దమాన టీవీ నటి ఝాన్సీ బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్లోని శ్రీనగర్కాలనీలో తన నివాసంలో ఆమె మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాటీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది ఝాన్సీ. మంగళవారం రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్న ఝాన్సీని, ఆఫీసు నుంచి వచ్చిన ఆమె సోదరుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, అప్పటికే ఆమె మృతిచెందినట్టు నిర్ధరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.

Image result for actress jhansi

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని కడలి గ్రామానికి చెందిన ఝాన్సీ, సినిమాల్లో అవకాశాలు వెదుక్కొంటూ హైదరాబాద్కు వచ్చింది. పవిత్రబంధం సీరియల్తోపాటు మరో రెండు సినిమాల్లోనూ నటించిన ఆమె, తన తల్లి, సోదరుడితో కలిసి శ్రీనగర్కాలనీలో నివాసం ఉంటోంది.అయితే ఝాన్సీ బలవన్మరణానికి ప్రేమ వ్యవహరమే కారణమని తెలుస్తోంది. ఝాన్సీ సూర్య అలియాస్ నాని అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. వివాహం చేసుకోమంటే అతడు ముఖం చాటేసినట్టు తెలిపారు. మంగళవారం ఉదయం సూర్యతో గొడవ జరిగినట్టు ఆమె బంధువులు తెలియజేశారు. ఝాన్సీని నాని బాగా కొట్టాడు. గత మూడు నెలలుగా సూర్య, ఝాన్సీలు గొడవపడుతున్నట్టు పేర్కొన్నారు.పెళ్లి గురించి అడిగినప్పుడల్లా ఝాన్సీ మీద చెయ్యి చేసుకునేవాడంట. నానితో పరిచయం అయిన తర్వాత ఝాన్సీ సీరియల్స్ మానేసిందని ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. సూర్య తనను మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురయ్యినదని కుటుంబ సభ్యులు వివరించారు. అవకాశాలు తగ్గిపోవడం, సూర్యతో ప్రేమ వ్యవహారంలో విఫలమవడమే ఆత్మహత్యకు కారణమని అంటున్నారు. నాని కూడా సినీ అవకాశాల తిరుగుతున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ముందు ఝాన్సీని అడ్డు పెట్టు అవకాశాలు కొట్టేయాలని నాని అనుకున్నాడంట. అయితే నాని మాయలో పడ్డ ఝాన్సీ కూడా సీరియల్స్ నటించడం మానేసింది.దాంతో ఝాన్సీ వల్ల ఉపయోగం ఉండదని నాని ఆమెను దూరం చేసుకోవాలనుకున్నాడు. దీనిని తట్టుకోలేకనే అతను ఆత్మహత్య చేసుకుంది. గాంధీ హాస్పిటల్ కు మృతదేహాన్ని తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్య కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈమె మరణవార్త విన్న తోటి నటీనటులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె మృతికి నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం. మరి ఝాన్సీ గురించి అలాగే ఆత్మహత్యకు ముందు జరిగిన పరిణామాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.