సతీసమేతంగా అన్నయ్యకు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెష్.

349

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 63 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి మన అందరికి తెలిసినదే.మెగాస్టార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రలో చిరు అభిమానులు పుట్టినరోజు వేడుకులకు జరుపుతున్నారు. సైరా టీజర్ తో నిన్ననే మెగా సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి.

టాలీవుడ్ సెలెబ్రిటీలంతా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా విష్ చేశాడు.మెగా బ్రదర్స్ మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్నయ్య పై తనకున్న ప్రేమని మరోమారు పవన్ కళ్యాణ్ చాటుకున్నాడు. తన సతీమణి అన్నా లెజినోవా, చిన్న కొడుకు మార్క్, కుమార్తె పోలేనాతో కలసి చిరు ఇంటికి వెళ్లారు.చిరుకు పవన్ దంపతులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

 

పవన్ చిన్న కొడుకుపుష్ప గుచ్చం, గిఫ్ట్ ని చిరంజీవికి అందజేశారు.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ మొత్తం సందడిలో పవన్ చిన్న కొడుకు మార్క్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాడు.మార్క్ క్యూట్ లుక్స్ అందరిని ఆర్షిస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ఈ ఫోటోలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.