చిరు విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన పవన్ కళ్యాణ్..

369

తెలంగాణ హరితహారంలో భాగంగా చేపట్టిన ‘గ్రీన్‌ ఛాలెంజ్’కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది.సోషల్ మీడియాలో కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా పలువురు సెలెబ్రిటిలు మొక్కలు నాటుతున్నారు.బడా బడా పొలిటీషయన్లతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొని ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.

కేటీఆర్‌, కవిత, సచిన్‌, రాజమౌళి, మహేష్‌ బాబు లాంటి ప్రముఖులు ఇప్పటికే ఇందులో పాల్గొన్నారు కూడా.అయితే నిన్న గ్రీన్ ఛాలెంజ్ లో బాగంగా మెగాస్టార్ చిరంజీవి మొక్కలు నాటడంతో పాటు తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో పాటు అమితాబ్ బచ్చన్, రామోజీరావును మొక్కలు నాటాలని సవాల్ చేశారు.అయితే చిరంజీవి విసిరినా గ్రీన్ ఛాలెంజ్‌పై పవన్ కళ్యాణ్ వెంటనే రియాక్ట్ అయ్యారు.

మెగాస్టార్ ఛాలెంజ్ స్వీకరించిన పవర్ స్టార్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్, మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.మొక్కలు నాటే కార్యక్రమంలో అభిమానులతో పాటు జన సైనికులు పాల్గొనాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కోరారు.