మళ్లీ తెరపైకి పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌.. త్వరలోనే సెట్స్ మీదకు సినిమా..

305

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని కోట్ల మందికి దేవుడు.అయితే అలాంటి దేవుడు సినిమాలు వదిలేసి ప్రజా సేవ కోసం రాజకీయాలలోకి వెళ్ళాడు.ఇక సినిమాలు చెయ్యను అని పవన్ కళ్యాణ్ చెప్పేశాడు.దాంతో అభిమానులు నిరాశపడ్డారు.ఇక మా దేవుడు తెర మీద కనపడడు అని అభిమానులు చాలా బాధపడ్డారు.అయితే ఇప్పుడు అభిమానుల ఆశ నెరవేరబోతోంది.

పవన్ కల్యాణ్ ఓ సినిమాలో నటించనున్నారనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. అదేమిటంటే..సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ చిత్రానికి గోపాల గోపాల, కాటమరాయుడు చిత్రాలను రూపొందించిన డాలీ దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలిసింది.గోపాల గోపాల, కాటమరాయుడు చిత్రాల నిర్మాణ సమయంలో డాలీ, పవన్ కల్యాణ్ మధ్య మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి.

pavan kalyan dalee కోసం చిత్ర ఫలితం

మేనల్లుడితో రూపొందించే చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించమని డాలీ చేసిన రిక్వెస్ట్‌కు పవర్ స్టార్ ఓకే అన్నట్టు వార్తలు వినపడుతున్నాయి.మేనల్లుడి కోసం కీలకమైన, అతిథి పాత్రను చేయడానికి సిద్ధపడినట్టు పవన్ సన్నిహితులు పేర్కొంటున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారట.