పవన్ కళ్యాణ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. కొత్త లుక్ చూస్తే షాక్

463

మొన్నటివరకు ఇండస్ట్రీలో నెంబర్ 1 గా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ టైమ్ పొలిటికల్ లీడర్‌గా మారడంతో ఆయన సినిమాలను బాగా మిస్ అవుతున్నారు ఆయన అభిమానులు. అయితే ఆయన నటనను మిస్ అవుతున్న అభిమానులకు త్వరలోనే ఒక తీపికబురు చెప్పబోతున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ లోటును పూడ్చేందుకు పవన్ కళ్యాణ్ కొడుకు కొణిదెల అఖిరానందన్ రెడీ అయ్యారా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Related image

తాజాగా ఆరడుగుల హైట్‌తో అదిరిపోయే స్టైలిష్ లుక్‌‌తో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు జూనియర్ పవర్ స్టార్ అఖిరానందన్. అఖిరానందన్‌కి సంబంధించిన స్టైలిష్ లుక్‌ని చూసి జూనియర్ పవర్ స్టార్ వచ్చేశాడంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్.

Image result for akira nandan

అఖిరానందన్‌ని చూసిన అభిమానులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైట్‌‌లో పవన్ కళ్యాణ్‌ని మించిపోయి ఉన్నాడు అకిరానందన్. మంచి కంటెంట్ ఉన్న కథ దొరికితే కొణిదెల వారసుడు టాలీవుడ్ అరంగేట్రం చేయడం.. పవర్ స్టార్ వారసుడిగా అతడు భవిష్యత్తులో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.