ఎన్నికల లోపు నిర్మాతగా పవన్ కళ్యాణ్ మరో సినిమా, హీరో ఎవరంటే!

346

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు. పవన్ కళ్యాణ్ మరో సినిమాలో నటించాలని కోరుకునే వారికి ఇది గుడ్ న్యూసే. ఆ దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో పవన్ ఈ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పవన్ గురించి మరో ఆసక్తికరమైన వార్త కూడా ప్రచారం జరుగుతోంది.

 

నిర్మాతగా కూడా ఒక సినిమా చేసే ఆలోచనలో పవన్ ఉన్నారట.ఇప్పటికే నితిన్ తో పవన్ ఛల్ మోహన్ రంగ చిత్రాన్ని నిర్మించాడు.త్వరలో మరొక సినిమాను నిర్మించనున్నాడంట.మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నాడు. తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

హీరో ఎవరంటే

వైష్ణవ్ లాంచ్ మూవీని పవన్ నిర్మించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కనుక జరిగితే వైష్ణవ్ తొలి చిత్రానికి మంచి స్టేజి దొరికినట్లే. ఈ చిత్రానికి కాటమరాయుడు డైరెక్టర్ డాలి పేరు వినిపిస్తోంది.