నన్ను అన్నిరకాలుగా వాడుకున్నాడు..దర్శకుడి మీద టాప్ హీరోయిన్ సంచలన కామెంట్స్ …

376

సినిమా చేయడానికి కొందరు కొన్ని కోణాలను చుస్తే, మరి కొందరు కథ డిమాండ్ బట్టి దేనికైనా రెడీ అనేలా ఉంటారు. సీన్ డీమాండ్ చేస్తే లిప్ లాక్ లు ఇప్పుడు కామన్ అయ్యాయి. లేటెస్ట్ గా కథ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నైన నటిస్తారు. అయితే న్యూడ్ గా నటించడం మన ఇండియన్ సినిమాలలో ఉండవు కానీ హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి. అలా నటించిన హీరోయిన్స్ బోల్డ్ గా కూడా మాట్లాడతారు.చాలా మంది హీరోయిన్స్ బోల్డ్ గా మాట్లాడటం కొత్తేమి కాదు. ఇక హాలీవుడ్ హీరోయిన్స్ గురించి అస్సలు చెప్పాల్సిన పని లేదు.

Image result for పాట్రిసియా క్లార్క్‌సన్

ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ 2019 అవార్డుల సందర్భంగా హాలీవుడ్ నటి పాట్రిసియా క్లార్క్‌సన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక వేధింపుల ఉద్యమం మీటూ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో పాట్రిసియా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. షార్ప్ అబ్జెక్ట్స్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మీడియాలో ఆసక్తిని రేకేత్తించాయి. షార్ప్ ఆబ్జెక్ట్ చిత్రంలో అద్బుతమైన నటనా ప్రదర్శనకు గాను 2019 గోల్డెన్ గ్లోబ్ అవార్డును ప్యాట్రాసియా క్లార్క్సన్ అందుకొన్నారు. ఈ చిత్రం లిమిటెడ్ సిరీస్ లేదా టెలివిజన్ కోసం ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో నటించినందుకు ఆమెకు ఉత్తమ సహాయనటి అవార్డు వరించింది. ప్యాట్రాసియా క్లార్క్సన్ అవార్డును అందుకొంటూ దర్శకుడు జీన్ మార్క్ వాల్లీపై ప్రశంసలు కురిపించారు.

ఆమె మాట్లాడుతూ…. ఈ సినిమా కోసం సెక్స్ అడగడం తప్ప దర్శకుడు తన వద్దనుంచి అంతా పిండుకొన్నారు. అదే నాకు బాగా నచ్చింది. ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది అని ప్యాట్రాసియా అన్నారు. దాంతో వేదిక వద్ద ప్రముఖులు ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు. షార్ప్ ఆబ్జెక్ట్స్ చిత్రంలో పరిణతి చెందిన మహిళగా, భార్యగా, తల్లిగా పలు షేడ్స్ పాత్రను అద్భుతంగా పోషించింది. ఈ చిత్రంలోని ఆమె పోషించిన పాత్ర సినీ విమర్శకుల ప్రశంసలకు నోచుకొన్నది. ఈ అవార్డును విలియయ్ హెచ్ మాసీ, ఫెలిసిటీ హాఫ్‌మన్ చేతుల మీదుగా అందుకొన్నారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. నటి ప్యాట్రాసియా గురించి ఆమె బోల్డ్ గా మాట్లాడిన మాటల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.