#RRR కోసం బాలీవుడ్ హీరోయిన్ ను ఒకే చేసిన జక్కన్న?

238

దర్శకదీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా #RRR. బాహుబలి లాంటి ఇంటర్నేషన్ సినిమా తీసిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఆయన ప్రెస్టీజ్ ఎక్కడ పోకూడదనే ఉద్దేశంతో చాల జాగ్రత్తగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హీరోలుగా రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను dvv దానయ్య నిర్మిస్తున్నాడు.

Image result for #RRR

ఈ మధ్యనే సెకండ్ షెడ్యూలు స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా గురించి ఇతర విషయాలు ఒకటి కూడా బయటపడలేదు. ఇటీవల తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని స్పష్టమైంది. ఈ నటుడి పేరు మినహా మిగిలిన పేర్లేమీ బయటకు రాలేదు.

Image result for parineeti chopra

అయితే హీరోయిన్లకు సంబంధించి ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ తాజాగా ఓ బాలీవుడ్ భామ పేరు బాగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా బాలీవుడ్ భామ పరిణీతీ చోప్రా ఎంపికైందని సమాచారం. అధికారిక ప్రకటన వస్తే కానీ ఈ విషయంపై క్లారిటీ రాదు.