‘పడి పడి లేచె మనసు’మూవీ రివ్యూ దుమ్ములేపిన సాయి పల్లవి

380

శర్వానంద్, సాయి పల్లవి జోడీగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పడి పడి లేచె మనసు’ మూవీ పాజిటివ్ బజ్‌తో శుక్రవారం నాడు (డిసెంబర్ 21)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతరిక్షం, కేజీఎఫ్, జీరో, మారి 2 తదితర చిత్రాలతో పోటీ పడుతూ విడుదలైన ఈ మూవీకి యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దామా.

Image result for padi padi leche manasu

‘పడి పడి లేచె మనసు’ ఫస్ట్‌లుక్‌లోనే శర్వానంద్, సాయి పల్లవిలు చాలా ఫ్రెష్ లుక్‌‌లో కనిపించి ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు. ప్రేమలో విఫలం అయినా కుర్రాడిలా శర్వా మన ముందుకు వస్తాడు. ఒక సంవత్సరం పాటు చీకటి జీవితాన్ని అనుభవిస్తుంటారు. అనుకోకుండా సాయి పల్లవి కలవడంతో అతని జీవితంలోకి వెలుగొస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సాగిన [ప్రేమకథనే పడీపడీ లేచే మనసు కథ.. కలకత్తా నేపథ్యంలో జరిగిన తన ప్రేమకథను శర్వానంద్ చెప్పుకురావడం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది.. లవ్, రొమాన్స్, సెంటిమెంట్, కామెడీ మేళవింపుతో చాలా ఆసక్తికరంగా దర్శకుడు ఈ సినిమాను మలిచారు. హను రాఘవపూడి టేకింగ్‌కి తోడు విశాల్ చంద్రశేఖర్ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్స్ యూత్‌ని కట్టిపడేశాయి.

Image result for padi padi leche manasu

శర్వా, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ బావుంది. పాటలు, కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్స్. వెన్నెల కిషోర్ పాత్ర చాలా బావుంది. వెన్నెల కిషోర్ మంచి హాస్యాన్ని పండించాడు.క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. సినిమా ఫస్ట్ చాలా చాలా బావుంది. కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా నిరాశపరిచింది. కొన్ని సీన్స్ ఎందుకు వస్తాయో అర్థం కాదు. ముఖ్యంగా ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు వచ్చే సీన్స్ ప్రేక్షకులకు అంతలా నచ్చవు. సెకండ్ హాఫ్ లో విజువల్స్ సరిగా లేవు. సెకండ్ హాఫ్ ను కూడా కాస్త మంచిగా తీసి ఉంటె సినిమా స్థాయి మరోలా ఉండేది. మంచి ప్రేమకథా చిత్రం అయ్యేది కానీ దర్శకుడు దానిని మ్యాజిక్ ను మిస్ చేశాడు.

ప్లస్ పాయింట్స్ : శర్వానంద్ సాయి పల్లవి యాక్టింగ్ వెన్నెల కిషోర్ కామెడీ సినిమాటోగ్రఫీ సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.

మైనస్ పాయింట్స్ : స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ డైరెక్షన్

ఈ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 2.5/ 5