‘పడి పడి లేచె మనసు’ ట్రైలర్ విడుదల.. సూపరో సూపర్

250

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పడి పడి లేచె మనసు’ విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ ఇప్పటికే విడుదల కాగా ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రేమ కథ చిత్రాల దర్శకుడు హను రాఘవ పూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని చెరుకూరిసుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Image result for ‘పడి పడి లేచె మనసు’ ట్రైలర్

శర్వా నందు ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా సాయి పల్లవి డాక్టర్ గా కనిపించనుంది.విడుదల చేసిన ట్రైలర్ లో ‘మిస్టర్ సూర్య.. మిస్టర్ సూర్య అంటూ సాయి పల్లవి పిలవడం.. శర్వానంద్ అరెరె.. మీరు ఏంటండీ ఇక్కడ? వాడు ఇక్కడ మీతో చూస్తే చంపేస్తాడు అని కంగారుగా చెప్పడం.. అప్పడు సాయి పల్లవి.. ఎవడాడు అని సీరియస్‌గా హస్కీ గొంతుతో అనడం.. శర్వానంద్ ‘మీ అజ్ఞాతప్రేమికుడు’ అని అనడం వెంటనే.. సాయి పల్లవి ఫాలో అవుతున్న శర్వానంద్ రివీల్ కావడం చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఆ పక్కనే ఉన్న ప్రియదర్శి నువ్ ఇన్‌స్టెంట్‌గా ఇన్ని దోసెలు ఎలా వేస్తావ్ రా అని ఆశ్చర్యంగా అడగటం.. దానికి శర్వానంద్ ‘ఆకలిరా.. బై.. ఆకలి’ అంటూ చెప్పడం చాలా ఫన్నీగా ఉంది.

ఓవరాల్‌గా ‘పడి పడి పడి లేచె మనసు’ చిత్రం ప్రేమికుల్ని కట్టిపడేయడం ఖాయమే అన్నట్టుగా ట్రైలర్‌ను చూస్తే ఓ అంచనాకు వచ్చేయొచ్చు. సాయి పల్లవి, శర్వానంద్‌ల జోడీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టే కనిపిస్తుంది. ఇక మొదటిసారి శర్వా – సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంఫై మంచి అంచనాలు వున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ ఈ చిత్రాన్ని హైలైట్ కానుంది. డిసెంబర్ 21 న ఈచిత్రం విడుదలకానుంది.