ఒక‌ప్పుడు బ‌స్ కండ‌క్ట‌ర్.. త‌ర్వాత సూప‌ర్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు సొంత రాజకీయపార్టీ

1196

తమిళ తలైవర్ రజినీకాంత్ గర్జించారు. ఏళ్ల తరబడి అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న రాజకీయ అర‌గ్రేటంపై ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చారు. రాజకీయ రంగ ప్రవేశంపై కొన్నాళ్లుగా కొనసాగుతున్న స‌స్పెన్స్ కు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెరదించారు. పోలిటికల్ బాంబు పేల్చారు రజినీకాంత్.

ఈ క్రింది వీడియో చూడండి.

రాజకీయాల్లోకి వస్తున్నానని, కొత్త పార్టీ పెడతానని, రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సంచ‌ల‌న ప్రకటన చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో అభిమానులకు ముందుగానే కొత్త సంవత్సరం శుభవార్తను అందజేశారు. అశేషాభిమానుల సమక్షంలో రజినీ చేసిన ప్రకటనతో అభిమానులు కొత్త సంవత్సరం సంబరాలను ముందుగానే మొదలుపట్టేశారు. తొలుత తనదైన స్టైలుతో అభిమానులకు రెండు చేతులతో అభివాదం చేస్తూ వేదికవైకి వచ్చిన రజనీ…కొద్దిసేపు ధ్యానముద్రలో ఉన్నారు. ఆ త‌ర్వాత కర్మణ్యే వాధికారస్తే అంటూ ప్రారంభిస్తూ రాజకీయాల్లోకి వస్తున్నా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.

Related image
రజనీకాంత్ .దేశ‌వ్యాప్తంగా ఈ పేరు తెలియ‌ని వారు ఊండరు. అయ‌న‌ పేరును తలుచుకుంటూ, ఒక్కసారైనా ర‌జ‌నీని కలిస్తే చాలూ అనుకునే అభిమానులు కోట్ల సంఖ్య‌లో ఉన్నారు. అలాంటి రజనీ రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. బస్సు కండక్టర్‌ స్థాయి నుంచి రాజకీయ పార్టీ స్థాపనపై ప్రకటన వరకూ రజనీ జీవితం ప్ర‌తిక్క‌రికి స్పూర్తి. ఇక రజనీకాంత్‌ జీవితం కష్టసుఖాల కలబోత అని చెప్ప‌వ‌చ్చు.

Image result for rajini enters into politics

ఆయన మధ్యతరగతిలో కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారు. అయితే, బెంగుళూరులో నివాసం ఉండేవారు. రజనీకాంత్‌ తండ్రి శివాజీ రావు గైక్వాడ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌. రజనీకి ఐదేళ్లు వయసు ఉన్నప్పుడు తల్లి మరణించారు. అక్కడినుంచి రజనీ జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. రెండు పూట్ల తిండి తినేందుకు కూడా ఆయన కుటుంబం మొత్తం శ్రమించాల్సి వచ్చేది. దీంతో యుక్తవయసు వచ్చాక రజనీ పలు ఉద్యోగాలు చేశారు.

Image result for rajini enters into politics

కర్ణాటక రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌లో బస్‌ కండక్టర్‌గా పనిచేశాడు. బస్సులోని ప్రయాణీకులను ఉత్సాహ‌పరుస్తూ రోజు గడిపేసే వారు రజనీ. రజనీ టిక్కెట్లు ఇచ్చి, చిల్లర తిరిగిచ్చే స్టైల్‌ను చూసేందుకు ప్రయాణీకులకు బాగా న‌చ్చేది. దీంతో ఆయన బస్సు వచ్చే వరకూ బస్‌స్టేషన్‌లో ఎదురుచూసేవారు. ఆ త‌ర్వాత 1973లో ఓ స్నేహితుడి నుంచి కొంత ఆర్థిక సాయం తీసుకున్న రజనీ.. మద్రాస్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరారు.అదే సమయంలో రజనీ ఇచ్చిన ఓ నాట‌క‌ ప్రదర్శన డైరెక్టర్‌ కే బాలచందర్‌ కంట్లో పడింది. రజనీని కలిసిన బాలచందర్‌.. తమిళం నేర్చుకోమని సలహా ఇచ్చారు. అపూర్వ రాగాంగళ్‌ సినిమాలో కేన్సర్‌ పేషెంట్‌ పాత్రకు రజనీని ఎంపిక చేసుకున్నారు బాలచందర్‌. ఆ తర్వాత మరో సినిమాలో కూడా రజనీకి బాలచందర్‌ అవకాశం ఇచ్చారు. ఆ రెండు సినిమాలు భారీ హిట్‌ కావడంతో రజనీకాంత్‌ వెనక్కు తిరిగిచూసుకోవాల్సిన పని లేకుండా పోయింది.

Image result for rajini enters into politics

అప్ప‌టి నుంచి ఇప్పటి వ‌ర‌కూ ఎన్నో సినిమ‌ల్లో న‌టించిన ర‌జ‌నీ, సూప‌ర్ స్టార్ గా పేరు సంపాదించుకుని, ఎన్నో కోట్ల మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. దేశ‌వ్యాప్తంగా ర‌జ‌నీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే 67 ఏళ్ల రజనీకాంత్‌ రాజకీయ రంగం ప్రవేశంపై కొద్ది నెలలుగా చర్చ కొనసాగింది. దీనిపై పలుమార్లు మాట్లాడిన ఆయన రాజకీయాలు భ్రష్టు పట్టాయని.. అందులోకి దిగాలంటే భయమేస్తోందని అన్నారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంబనకు ఆదివారం ఫ్యాన్స్‌ మీట్‌లో తెరదించారు రజనీ. అయితే గ‌తంలో పలు రాజకీయ పార్టీల తరఫున గతంలో రజనీకాంత్‌ చేసిన ప్రచారం కొన్నిచోట్ల విజయం సాధించిపెట్టగా.. మరొకొద్ది చోట్ల ప్లాప్‌ షోగా మారింది.

Image result for rajini enters into politics

ఇక 1996 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-టీఎంసీ కూటమి గెల‌వ‌డానికి కారణం రజనీకాంతే. జయలలిత తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి అయితే తమిళనాడును దేవుడు కూడా రక్షించలేడు అనే స్టేట్‌మెంట్‌ను రజనీకాంత్‌ ఎన్నికల ప్రచారంలో బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఆ తర్వాత జ‌రిగిన ఎన్నికల్లో డీఎంకే – బీజేపీ కూటమి తరఫు రజనీ మళ్లీ ప్రచారం చేసినా నిరాశ ఎదురైంది. ఆ ఎన్నిక‌ల్లో 39 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగగా.. కేవలం తొమ్మిది చోట్ల మాత్రమే డీఎంకే – బీజేపీ కూటమి విజయం సాధించ‌గ‌లిగింది. ఇక 2004 లోక్‌సభ ఎన్నికల్లో పీఎంకేకు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని రజనీ ప్రజలను కోరినా అది కూడా స‌క్సెస్ కాలేదు.ఆ ఎన్నికల్లో పీఎంకే పోటీ చేసిన అన్నిచోట్లా ఘ‌న విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత ఇప్పుడు తానే స్వ‌యంగా రాజ‌కీయాల్లోకి అడుపెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు ర‌జ‌నీ. మ‌రి రాజ‌కీయాల్లో ర‌జ‌నీ స‌క్సెస్ అవుతారా.. లేదా అనేది కాల‌మే నిర్ణ‌యిస్తుంది. మ‌రి చూడాలి సినిమాల్లో శిఖ‌రానికెగెరిన ర‌జ‌నీ, పాలిటిక్స్ లో ఎంత‌వ‌ర‌కు రాణిస్తారో..

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!

2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!