పెళ్లి రోజున బన్నీకి ఎన్టీఆర్ పంపిన గిఫ్ట్ చూసి షాక్ అయినా స్నేహారెడ్డి

372

టాలీవుడ్ టాప్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న హీరో. మొదట్లో ప్రేమకథా చిత్రాల్లో నటించిన అల్లు అర్జున్.. ఆ తరవాత యాక్షన్ సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా నిలదొక్కుకున్నారు. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే బన్నీ.. కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి బంధంతో ఒక్కటైన బన్నీ, స్నేహాల జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. నిన్న వీరి ఎనిమిదో వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా బన్నీ తమ పెళ్లి ఫొటోను ట్వీట్ చేశారు. ఒక హార్ట్ ఎమోజీతో పాటు 8 ఇయర్స్ అనే క్యాప్షన్‌ను ఆ ఫొటోకు పెట్టారు.

Image result for allu arjun family

అల్లు అర్జున్, స్నేహారెడ్డిది ప్రేమవివాహం. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని అమ్మాయి స్నేహా రెడ్డి. ఇబ్రహీంపట్నంలో బీటెక్ చదివిన స్నేహారెడ్డి అమెరికాలో ఎమ్మెస్ చేశారు. వ్యాపారవేత్త, విద్యాసంస్థల అధినేత కేపీఎస్ రెడ్డి కుమార్తె ఈమె. కులాలకు అతీతంగా వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. అయితే ఈ పెళ్లి కోసం ఎక్కువగా కష్టపడింది అల్లు అర్జునేనని చాలా మంది అంటుంటారు. అల్లు అరవింద్ తొలుత ఈ పెళ్లికి అయిష్టత చూపారట. అయితే బన్నీ బాగా ఒత్తిడి చేయడంతో అంగీకరించారని చెబుతుంటారు. వీటి వివాహం 2011 మార్చి 6న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వారి ప్రేమకు ప్రతిరూపంగా 2014 ఏప్రిల్ 4న అయాన్ జన్మించాడు. 2016లో కూతురు అర్హ జన్మించింది.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే నిన్న వీళ్ళ పెళ్లిరోజుకు చాలా మంది సెలెబ్రిటీస్ విషెస్ చెప్పారు. అందులో ఎన్టీఆర్ ఒకడు.ఎన్టీఆర్ బన్నీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. బయట ఎక్కువగా కలిసి తిరగకపోయిన ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అయితే పెళ్లిరోజు కానుకగా ఎన్టీఆర్ బన్నీకి స్నేహాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడంట. ఏం గిఫ్ట్ ఇచ్చాడని అనుకుంటున్నారా.. ఇద్దరికీ ఖరీదైన వాచ్ లను గిఫ్ట్ గా పంపించాడంట. ఆ రెండు వాచ్ లు ఒకే కంపెనీకి చెందినవని తెలుస్తుంది. వాటిధర లక్షలలో ఉంటుందని సమాచారం. ఇలా ఎన్టీఆర్ బన్నీకి గిఫ్ట్ ఇవ్వడం ఇప్పుడు అందరికి ఆశ్చర్యపరుస్తుంది. ఈ మధ్య సినీ హీరోలు చాలా కలివిడిగా ఉంటున్నారు. ఒకరి ఫంక్షన్ కు ఒకరు వెళ్తున్నారు. కలిసి పార్టీలు చేసుకుని మేమంతా ఒకటే అనే సంకేతాన్ని అభిమానులకు ఇస్తూ మీరు కూడా మాలాగా కలిసి ఉండండి అని చెప్పకనే చెబుతున్నారు. మరి బన్నీకి ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ గురించి వీళ్లిద్దరి స్నేహం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.