బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన నూతన నాయుడు..కౌశల్ దగ్గర ఏం చెప్పాడో తెలుసా..

436

బిగ్ బాస్ హౌస్ లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని మలుపులు ఆడియన్స్ కు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందనే ఊహాగానాలు బిగ్ బాస్ పై ఆసక్తిని మరింతగా పెంచేస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే నూతన్ నాయుడు, శ్యామల తిరిగి హౌస్ లోకి వెళ్లనుండడమే. ఈ వారం నామినేట్ అయినవారిలో కౌశల్, దీప్తి, నందిని, బాబు, గణేష్ ఉన్నారు. ఎవరు ఎలిమినేటి అవుతారో ఆదివారం తేలనుంది. నేడు జరగబోయే ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోని తాజగా విడుదల చేశారు.అందులో రీ ఎంట్రీ ఇచ్చిన నూతన నాయుడు ఇంట్లోకి అడుగు పెట్టాడు.అయితే అతను అడుగు పెట్టిన తర్వాత ఇంట్లో కొన్ని ఆసక్తికర విషయాలు జరిగాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for nutan naidu in bigg boss

ఇంటిలోని సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో గిఫ్ట్ వచ్చింది. ప్రోమోలో చూపిన దాని ప్రకారం హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం వారికీ వచ్చిన గిఫ్ట్స్ అందుకుంటున్నారు. గిఫ్ట్స్ చూసి వాళ్ళు షాక్ అవుతున్నారు.అందరికంటే చివరగా గణేష్ గిఫ్ట్ అందుకుంటాడు. అతడి గిఫ్ట్ సీక్రెట్ రూంలో ఉంటుంది. పెద్దగా ఉన్న పార్సిల్ చూసి గణేష్ ఆశ్చర్యపోతాడు. అందులో ఏముందని తెరచి చూడడగా నూతన నాయుడు బయటకు వస్తాడు. అనుకోకుండా జరిగిన ఘటనతో గణేష్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు.నూతన నాయుడు ఆరంభంలో రెండు వారలు హౌస్ లో ఉన్నారు. ఆ తరువాత ఆయన ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.నూతన్ నాయుడు రీ ఎంట్రీతో హౌస్ లోని సభ్యుల్లో సంతోషం నెలకొంది.ముఖ్యంగా నూతన నాయుడును చూడగానే కౌశల్ కు తెగ ఆనందం వేసింది.

Nutan Naidu & Syamala To Enter Into House From Wednesday?

నూతన నాయుడు రావడం వలన కౌశల్ ఎంత ఆనందంగా ఉన్నాడనేది అతని కళ్ళను చూస్తే తెలిసిపోతుంది.దాదాపు 55 రోజులు ఇంట్లో ఒంటరి పోరాటం చేస్తున్న కౌశల్ తనను అర్థం చేసుకుని సపోర్ట్ గా ఉండే నూతన నాయుడు రావడం కౌశల్ కు తెగ ఆనందాన్ని ఇచ్చింది.అయితే నూతన నాయుడుతో మాట్లాడుతూ మా ఇంటి సభ్యులు ఎలా ఉన్నారు.పిల్లలు నా భార్య ఎలా ఉన్నారో ఏమైనా తెలుసా అంటూ వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అందరు బాగానే ఉన్నారు.నేను మీ ఇంటికి కూడా వెళ్ళాను.మీ భార్య వండిన వంటలతో నేను తృప్తిగా భోజనం కూడా చేశాను.నీకోసం మీ భార్య ఎంతో కష్టపడుతుంది.నీకు బయట చాలా మంది ఫాన్స్ అయ్యారు.నీ నిజాయితి నీ గేమ్ ప్లానింగ్ అన్ని చక్కగా ఉన్నాయి.అందులో నీకు ఫాన్స్ ఎక్కువయ్యారు.నువ్వు నీలా ఉండు అంటూ కౌశల్ కు దైర్యం చెప్పాడు.బయట ఎవరెవరి గురించి ఏమనుకుంటున్నారు అన్న విషయాల గురించి కౌశల్ కు నూతన నాయుడు చెప్పాడు.

కానీ ఈ ప్రోమోలో శ్యామల గురించి ప్రస్తావన లేదు. నూతన నాయుడుతో పాటు శ్యామల కూడా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎంపికైంది. కానీ నేడు నూతన్ నాయుడు మాత్రమే ఎంపిక ఎంట్రీ కావడంతో శ్యామల విషయం సస్పెన్స్ లోకి వెళ్ళింది.ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోపల గీత, కౌశల్, బాబు వివాదంతో వాతావరణం వేడెక్కింది. ఇక నూతన్ నాయుడు కూడా ఎంట్రీ ఇవ్వడంతో మరింత హీటెక్కనుంది. ఇటీవల అభిమానులతో నూతన్ నాయుడు మాట్లాడే సమయంలో మీరు నన్ను హౌస్ లోకి పంపించడండి నేను బాబు సంగతి చూస్తా అంటూ మాట్లాడాడు.నూతన్ నాయుడులో యాంగ్రీ మాన్ ఉన్నాడు. షో ఆరంభంలోనే తనీష్, నూతన్ నాయుడు మధ్య పెద్ద వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపై బిగ్ బాస్ 2 లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.మరి నూతన నాయుడు ఎంట్రీ గురించి ఇక నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఎదురుకావోచ్చు అనుకుంటున్నారు.మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

జేసి పావులు క‌దుపుతున్నారు