జైలుకి వెళ్లిన మోహన్ బాబు బయటకు రావడానికి సహాయం చేస్తున్న ఎన్టీఆర్

391

ఈ మధ్య మోహన్ బాబుకు అస్సలు బాగుండటం లేదు. తన కాలేజీ ఫీజ్ రీమెంబర్స్ మెంట్ విషయంలో చంద్రబాబుతో గొడవ అయ్యింది. ఫ్యామిలీ మొత్తం టీడీపీ పార్టీని తిట్టారు. ర్యాలీ కూడా చేశాడు. ఆ తర్వాత వైసిపి పార్టీలో చేరి జగన్ ను సీఎం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. ఈ గొడవలన్నీ ఒక పక్కన ఉంటె మరొక పక్కన మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష వేసింది. మంచు విష్ణు హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో డిజాస్ట‌ర్ అయింది. ఈ చిత్రం విష‌యంలో వైవీఎస్ చౌదరి, మోహన్ బాబు మధ్య విబేధాలు వచ్చాయి. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ సంస్థ‌లో ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మించాడు మోహ‌న్ బాబు. అయితే సినిమా దారుణంగా నిరాశ ప‌రిచింది. న‌ష్టాలు కూడా భారీగా రావ‌డంతో అక్క‌డే డబ్బు విషయంలో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు కూడా వ‌చ్చాయి. దాంతో అక్క‌డ్నుంచి ఈ కేస్ న‌డుస్తుంది. అప్ప‌ట్లో మోహ‌న్ బాబుపై ఈ కేస్ ఫైల్ చేసాడు ఈ ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తం 41.50 ల‌క్ష‌ల రూపాయ‌ల విష‌యంలో ఈ చెక్ బౌన్స్ ఉంది.

ఈ క్రింది వీడియో చూడండి

అప్ప‌ట్లో ఈయ‌న ఇచ్చిన చెక్ బ్యాంకులో చెల్ల‌క‌పోవ‌డంతో బౌన్స్ అయ్యింది. దీంతో వైవీఎస్ చౌదరి కోర్టుకు వెళ్లాడు. 9 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు ఎర్రమంజిల్ కోర్టు ఈ కేసు విష‌యంలో సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. వైవిఎస్ చౌద‌రికి బాకీ ప‌డిన డ‌బ్బును 3 నెలల్లో తిరిగివ్వాల‌ని ఆదేశించింది కోర్టు. అంతేకాదు అద‌నంగా మ‌రో ల‌క్షా 25 వేలు కూడా ఫైన్ వేసింది.చెప్పిన స‌మ‌యంలో డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఈ శిక్ష విధించింది కోర్ట్. పైగా వైవిఎస్ చౌద‌రికి 10 వేలు కూడా ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ విష‌యంలో కోర్ట్ మూడు నెల‌లు టైమ్ ఇచ్చింద‌ని చెప్పారు న్యాయ‌వాది. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉందని వాళ్లు చెప్తున్నారు. ఈ కేసులో A1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, A2గా మంచు మోహన్ బాబుగా కోర్టు తేల్చింది.అయితే మోహన్ బాబు బెయిల్ మీద విడుదల అయ్యాడు.

Image result for mohan babu

మోహన్ బాబు ఈ కేసు నుంచి బయటపడేలా చేసిన వ్యక్తి ఒకడు ఉన్నాడంట. ఆ ఒక్కడు ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. తారక్ మోహన్ బాబుకు బాగా క్లోజ్. ఎన్టీఆర్ ను సొంత కొడుకులా భావిస్తాడు మోహన్ బాబు. అలాగే మంచు మనోజ్ ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ గురించి కూడా తెలిసిందే. హరికృష్ణ చనిపోయినప్పుడు ఎన్టీఆర్ కు తోడుగా ఉన్నది మంచు మనోజ్ మాత్రమే. అలా రెండు కుటుంబాల మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. అయితే మోహన్ బాబుకు శిక్ష పడ్డ తర్వాత వెంటనే బెయిల్ వచ్చేటట్టు చేసింది మన తారకే అంటా. తన లాయర్లతో మాట్లాడి మోహన్ బాబుకు బెయిల్ ఇప్పించాడంట. ఈ విషయం తెలిసి మోహన్ బాబు కూడా కొంచెం భావోద్వేగానికి గురయ్యారంట. మరి మోహన్ బాబుకు ఎన్టీఆర్ చేసిన ఈ సాయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.