ఎన్టీఆర్8 మంది కొడుకులు 4 కూతుళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

617

నంద‌మూరి తార‌క‌రామారావు తెలుగుప్ర‌జ‌ల‌కు బాగా ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తి.. ఆయ‌న మే 28- 1923 న జ‌న్మించారు.. ఇక‌వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చిన ఆయ‌న 1949 లో మ‌న‌దేశం సినిమాతో తెలుగుతెర‌కు ప‌రిచ‌యం అయ్యారు.ఇక 1942లో బ‌స‌వ‌తార‌కంను పెళ్లి చేసుకుని 12 మంది సంతానం క‌లిగారు. ఆయ‌న‌కు ఎనిమిది మంది అబ్బాయిలు, న‌లుగురు అమ్మాయిలు పిల్ల‌లు.ఆయ‌న పిల్ల‌లు రామ‌కృష్ణ‌, జ‌య‌కృష్ణ‌, సాయికృష్ణ‌, హ‌రికృష్ణ‌, మోహ‌న్ కృష్ణ‌, బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ రామ‌కృష్ణ‌,జ‌య‌శంక‌ర్ కృష్ణ‌, జ‌య‌శంక‌ర్ కృష్ణ‌, ఇక కుమార్తెలు అయితే గార్ల‌పాటి లోకేశ్వ‌రి, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, నారా భువ‌నేశ్వ‌రి, కాంత‌మ‌నేని ఉమా మ‌హేశ్వ‌రి.

Image result for nandamuri rama rao family

ఎన్టీఆర్ భార్య బ‌స‌వ‌త‌రాకం 1985లో మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ కొన్నిరోజుల‌కు ల‌క్ష్మీపార్వ‌తిని వివాహం చేసుకున్నారు. ఇక ఆయ‌న కుటుంబంలో మొద‌టి కుమారుడు రామ‌కృష్ణ 1963 లో మ‌ర‌ణించారు.దీంతో ఆయ‌న ఎంతో కుమిలిపోయారు త‌ర్వాత‌, ఏడ‌వ సంతానం క‌లిగిన‌ప్పుడు పెద్ద కుమారుడి పేరుని వ‌చ్చేలా ఏడ‌వ కుమారుడికి జూనియ‌ర్ రామ‌కృష్ణ అని పేరు పెట్టారు. అలాగే ఆయ‌న పేరుమీద రామ‌కృష్ణా స్టూడియో నిర్మించారు. ఎన్టీఆర్ కుమారుల్లో సినియ‌ర్ రామ‌కృష్ణ‌, సాయికృష్ణ హ‌రికృష్ణ‌ మ‌ర‌ణించారు.రెండ‌వ కుమారుడు జ‌య‌కృష్ణ వ్యాపారం లో ఉన్నారు ఆయ‌న కుమార్తె కాముద్మి ఆత్మ‌హ‌త్య ప్ర‌యత్నం చేసి వార్త‌ల్లో నిలిచారు.

మూడ‌వ కుమారుడు సాయికృష్ణ ఈయ‌న‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం బాత్రూంలో జారిప‌డిన ఆయ‌న చికిత్స తీసుకుంటూ కోమాలో ఉండి 2004 లో మ‌ర‌ణించారు.. ఇక నాల్గ‌వ కుమారుడు హ‌రికృష్ణ‌, ఈయ‌న‌కు ఇద్ద‌రు భార్య‌లు, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.మొద‌టి భార్య ల‌క్మీ, రెండ‌వ‌భార్య‌ శాలిని.. జాన‌కిరామ్ క‌ల్యాణ్ రామ్, సుహాసిని, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈయ‌న కుమారులు2014 డసెంబ‌ర్ 6 న రోడ్డుప్ర‌మాద‌లో జాన‌కీరామ్ మ‌ర‌ణించారు.. అలాగే హ‌రికృష్ణ ఇటీవ‌ల కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.ఇక ఐద‌వ కుమారుడు మోహ‌న్ కృష్ణ ఈయ‌న ఫేమ‌స్ ప్రొడ్యూస‌ర్, ఈయ‌న‌కు ఓ కుమారుడు ఉన్నారు తెలుగు సినిమాల్లో న‌టించిన తార‌క‌ర‌త్న ఈయ‌న వార‌సుడు.ఆర‌వ కుమారుడు నంద‌మూరి బాల‌కృష్ణ మ‌నంద‌రికి తెలిసిన వ్య‌క్తి.. హీరోగా ఎమ్మెల్యేగా కొన‌సాగుతూ ఉన్నారు.ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమార్తెలు అలాగే ఓ కుమారుడు మోక్ష‌జ్ఞ ఉన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మోక్ష ఇప్పుడు సినిమా రంగంలోకి వ‌చ్చేందుకు ప్ర‌యత్నాలు చేస్తున్నారు.. ఏడ‌వ కుమారుడు జూనియ‌ర్ రామ‌కృష్ణ పెద్ద ప్రొడ్యుస‌ర్, అలాగే ఇండ‌స్ట్రీలిస్ట్ గా ఉన్నారు.. ఇక ఆయ‌న‌కు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు..ఎనిమిదోవ కుమారుడు జ‌య‌శంక‌ర్ కృష్ణ , ఈయ‌న కూడా వ్యాపార‌రంగంలో స్ధిర‌ప‌డ్డారు.ఇక కుమార్తెల్లో పురందేశ్వ‌రి రాజ‌కీయాల్లో ఉండి త‌న తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఇక మిగిలిన ముగ్గురు కుటుంబాల‌కు ప‌రిమితం అయ్యారు.. ఇది ఎన్టీఆర్ ఫ్యామిలీ చూశారుగా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.