ఎన్టీఆర్- వైయ‌స్సార్- కేసీఆర్ ఎవ‌రు అలరిస్తారో

393

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్క‌డ న‌లుగురు మాట్లాడుకున్నా కేవ‌లం బ‌యోపిక్ ల గురించి మాత్ర‌మే చ‌ర్చించుకుంటున్నారు.. మొత్తం చ‌ర్చ అంతా బ‌యోపిక్ ల గురించే న‌డుస్తోంది.. ఇప్ప‌టికే ఎన్టీఆర్ పేరుతో బాల‌య్య ఎన్టీఆర్ గా బ‌యోపిక్ లో న‌టిస్తున్నారు.. ఈ సినిమాకి క్రిష్ డైరెక్ట‌ర్ .. ఇక వైయ‌స్సార్ బ‌యోపిక్ కూడా రెడీ అవుతోంది.. ద‌ర్శ‌కుడు మ‌హి. వి రాఘ‌వ మ‌మ్ముట్టి చేస్తున్న చిత్రం యాత్ర.. ఇప్పటికే ఈ రెండు సినిమాల‌పై తెలుగు ప్రేక్ష‌కులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు.. రాజ‌కీయంగా ఎటువంటి మ‌లుపులు తిప్పుతాయా అని చూస్తున్నారు.

Image result for ysr biopic
తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ బయోపిక్ ను కూడా రూపొందిస్తోన్న విషయం తెలిసిందే… ఇటు ఎన్టీఆర్, బ‌యోపిక్ క్రిష్ తెరకెక్కించ‌డంతో, ఆయ‌న గ‌తంలో హిట్స్ ఇచ్చారు కాబ‌ట్టి ఆయ‌న ఎన్టీఆర్ సినిమాని ఇంకెంత బాగా చూపిస్తారు అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. ఇక యాత్ర‌పై కూడా అలాగే ఎదురుచూపులు ఉన్నాయి.

Image result for ntr biopic

ఇక కేసీఆర్ బ‌యోపిక్ ద‌ర్శకుడు, అల్లూరి కృష్ణం రాజు తెర‌కెక్కిస్తున్నారు… ఇక్క‌డ కూడా తెలంగాణ ప్ర‌జ‌లు, నాటి తెలంగాణ ఉద్య‌మం నుంచి, నేడు తెలంగాణ సాధించుకున్న ప్రతీ అంశం ఈ సినిమాలో ఉంటుంది అని అనుకుంటున్నారు..

Image result for kcr biopic

ఇక వీరు ముగ్గురిలో ఇద్ద‌రు కొత్త డైరెక్టర్లు, క్రిష్ కు కాస్త అనుభ‌వం ఉంది.. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు అంద‌రూ ఈ బ‌యోపిక్ లు చూసే అవ‌కాశం ఉంది.. అయితే ఈ సినిమాల వ‌రుస‌లో ఏ సినిమా ఎలా అల‌రించ‌నుందో చూడాలి..