రామ్ చరణ్ కోసం చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్..ఇంకా ఎవరెవరంటే ?

258

ఎన్టీఆర్ రామ్ చరణ్ లబంధం ఈ మధ్య చాలా స్ట్రాంగ్ అయ్యింది.ఇద్దరు కలిసి జక్కన దర్శకత్వంలో #RRR చేస్తున్నారు.ఈ సినిమా వల్లనే ఇద్దరి మధ్య స్నేహం గట్టిపడింది.అయితే ఎన్టీఆర్, రాంచరణ్ అతి త్వరలో ఒకే వేదికపై కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Image result for vinaya vidheya rama songs

రాంచరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ హీరో ప్రశాంత్, స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కుటుంబ బంధాలతో అద్భుతమైన ఫ్యామిలీ డ్రామాతో పాటు.. విలన్ తో కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలని బోయపాటి తీర్చి దిద్దారు. ఆ మధ్యన విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ఫ్యామిలీ సాంగ్ ని విడుదల చేసారు. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Related image

త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతునట్లు తెలుస్తోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ మాత్రమే కాదు రాజమౌళి కూడా ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారట. వినయవిధేయ రామ చిత్రానికి, ఆర్ఆర్ఆర్ చిత్రానికి నిర్మాత దానయ్యే . దీనితో వినయ యవిధేయ రామ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆర్ఆర్ఆర్ టీంని చూడవచ్చు.