బిగ్ బాస్ 3 హోస్ట్ గా తారక్?

214

గత ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. కౌశల్ విజేతగా, సింగర్ గీత మాధురి రన్నరప్ గా నిలిచారు. నాని హోస్టింగ్ సీజన్ మొత్తం ఆకట్టుకుంది.ఆ స్మృతులు మరిచిపోకముందే బిగ్ బాస్ 3 గురించి చర్చ నడుస్తుంది. మొదలైంది.

ఊహాగానాలు మాత్రమే

తెలుగులో తొలి బిగ్ బాస్ సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా, రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు.బిగ్ బాస్ 3 కోసం సీనియర్ నటుడిని హోస్ట్ గా తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఫేమ్, సీనియారిటీ రెండు ఉన్న నటుడు ఎవరని పరిశీలించగా బిగ్ బాస్ నిర్వాహకులలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరిని బిగ్ బాస్ టీం సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు కేవలం రూమర్ మాత్రమే అని వెంకటేష్ ఇటీవల క్లారిటీ ఇచ్చారు.

 రేసులోకి మళ్ళీ యంగ్ టైగర్

దాంతో బిగ్ బాస్-3కి మళ్ళి ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చేస్తూ బిగ్ బాస్ ను నడిపించడం అంటే అంత సాధ్యమైన పని కాదు. మరి వచ్చిన ఆ వార్త నిజమో కాదో తెలియాలంటే తారక్ స్పందించాల్సిందే.