అరవింద సమేత టీజర్…అంచనాలను మించి…

323

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న అరవింద సమేత టీజర్ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ రోజు విడుదల చేశారు… ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఇద్దరూ కలిసి మొదటిసారి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి.

దీనికి తోడు ఎన్టీఆర్ ‘జై లవకుశ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత త్రివిక్రమ్‌తో చేస్తుండటం ఒక విశేషమైతే.. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాడు. ఈ నేపథ్యంలో విడుదలైన టీజర్ ఈ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఈ చిత్రాన్ని ‘అజ్ఞాతవాసి’ చిత్ర నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా.. అక్టోబర్ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.