ఆ స్పెషల్ డే నాడు “అరవింద” టీజర్ రిలీజ్…!

30

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అరవింద సమేత కు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి..ఇప్పటికే విడుదలయిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది..ఈ సినిమా టీజర్ కోసం ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..అయితే తారక్ అభిమానులతో పటు ప్రేక్షకులను అలరించడానికి అరవింద టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్..టీజర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఐతే కరెక్ట్ గా ఎన్నిగంటలకు విడుదల చేయనున్నారో త్వరలో తెలియనుంది…

ఇక ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.