“అరవింద సమేత” టీజర్ లీక్..షాక్ లో ఎన్టీఆర్ త్రివిక్రమ్..

371

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం అరవింద సమేత ఇప్పుడు చిత్ర యూనిట్ ను అయోమయం లో పడేసింది..చిత్ర దర్శక నిర్మాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ సినిమాకు లీకుల బెడద వదలడం లేదు..మొన్నటి వరకు ఈ సినిమా పిక్స్ మాత్రమె లీకయ్యాయి..తాజాగా టీజర్ కూడా లీకయినట్టు తెలుస్తోంది..ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

ఇటీవల ఈ సినిమా టీజర్ ను ఈ నెల 15 న విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ప్రకటించిన మరుక్షణమే లీకయినట్టు తెలియడంతో షాక్ గురయ్యారు ఈ సినిమా యూనిట్ సభ్యులు..టీజర్ చూస్తుంటే మంచి ఎమోషనల్ గా కట్ చేసినట్లు క్లియర్ గా అర్ధం అవుతుంది. ఈ టీజర్ లో నాగబాబు , ఎన్టీఆర్ తో పాటు మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తుంది. మరి లీకైన టీజర్ నే విడుదల చేస్తారా..లేక మరోటి కట్ చేసి విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం అరవింద చిత్ర దర్శక , నిర్మాతలకు భయం పట్టుకుంది. సినిమా విడుదల నాటికీ ఇంకెలాంటి వీడియోలు లీక్ అవుతాయో అని భయపడిపోతున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదే యాసలో ఎన్టీఆర్ సంభాషణలు చెప్పబోతున్నాడు. ఎన్టీఆర్ కు జోడిగా పూజా హగ్దే నటిస్తుండగా, సునీల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.