తండ్రి చనిపోయిన 2 రోజులకే NTR మరో సంచలన నిర్ణయo

422

నందమూరి హరికృష్ణ మరణం తెలుగు సినిమా పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. అందులోనూ ఆయన ఫ్యామిలీలో ఇంకెంత విషాదం ఉంటుందో ఊహించుకోవచ్చు. నాన్న అంటే ప్రాణంగా ప్రేమించే జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పడే వేదన మాటల్లో వర్ణించలేం.పెద్ద దిక్కును కోల్పోయి వాళ్ళు పడుతున్న బాధ గురించి చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు.అయితే ఇంత బాధలో ఉండి కూడా ఎన్టీఆర్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.మరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో చూద్దామా.

Image result for harikrishna

హరికృష్ణ మరణం తర్వాత అభిమానులు నాన్నంటే తనకు ఎంత ఇష్టమో ఎన్టీఆర్ గతంలో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఆడియో వేడుకలో వివరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఎన్టీఆర్ స్పీచ్‌కు అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు.ఆ ఆడియో ఫంక్షన్ లో నాన్నల గురించి దేవీ ఎన్టీఆర్ సుకుమార్ చాలా గొప్పగా మాట్లాడారు.నాన్నకు ఏదైనా అయిపోతుంది అనే ఊహకూడా భరించలేనని ఎన్టీఆర్ అన్నాడు.కానీ ఇప్పుడు నాన్నను కోల్పోయాడు అంటే ఎంత బాధను అనుభవిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.అయితే ఇంత బాధలో కూడా ఎన్టీఆర్ తన పని గురించి మర్చిపోలేదు.ఈ బాధ నుండి బయట పడటానికి పనిలో మునిగిపోవడం తప్ప బహుషా మరో మార్గం లేదని అనుకున్నారో ఏమో.. వెంటనే పనిలో నిమ్మగ్నం అవ్వడానికి సిద్ధపడ్డారు.

Image result for harikrishna

మనసులో ఎంత బాధ ఉన్నా సరే తన వల్ల వేరేవారికి నష్టం జరగకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు.హరికృష్ణ మరణం వలన ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమెత వాయిదా పడింది.అయితే తన వల్ల ప్రొడ్యూసర్ కు నష్టం కలగకూడదని ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ ను వెంటనే స్టార్ట్ చెయ్యమన్నాడంట. సెప్టెంబర్ 1 నుండి తారక్ జాయిన్ అవుతుండటంతో మళ్లీ షూటింగ్ మొదలుకాబోతోంది.ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఇక కళ్యాణ్ రామ్ విషయానికి వస్తే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాకు కెవి గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇంత బాధలో కూడ ఆయన నిలిచిపోయిన చిత్రీకరణను ప్రారంభించమని దర్శక నిర్మాతలకు చెప్పారట. సోమవారం నుండి ఆయన షూటింగ్లో పాల్గొననున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాత. నివేత థామస్, షాలిని పాండే హీరోయిన్లు.ఈ విషయం తెలిసి సినిమా పెద్దలు హీరోలు అంటే అలా ఉండాలి.. తన వల్ల నిర్మాతకు ఎప్పుడు నష్టం కలుగకూడదు అనుకునేవాడే నిజమైన హీరో అని..ఈ ఇద్దరి నందమూరి వారసులు నిజమైన హీరోలని అందరు కొనియాడుతున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. అంత బాధను మనసులో పెట్టుకుని కూడా ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.