“ఎన్టీఆర్” బయోపిక్ సెకండ్ సాంగ్ రిలీజ్… అచ్చ తెలుగు పదాలతో అద్భుతం

262

మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ .క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు.

Image result for ‘ఎన్టీఆర్’ ‘రాజర్షి’ సాంగ్

రీసెంట్‌గా ఈ మూవీ నుంచి ‘ఘనకీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మణిదీపకా ఓ కథానాయకా’..అంటూ కైలాష్ ఖేర్ పాడిన పాటను రిలీజ్ చేసిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ఎన్టీఆర్ ‘ బయోపిక్ నుంచి రెండవ సింగిల్ ను విడుదల చేసింది. ‘తల్లి ఏదీ.. తండ్రి ఏడీ? అడ్డు తగిలే బంధమేది? మనిషివో… ఋషివో… రాజర్షివో…’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ఈ పాట కూడా పదహారాణాల అచ్చు తెలుగు పదాలతో కీరవాణి డా.కే.రామకృష్ణ సహాకారంతో ఈ పాటను శివదత్త రాశారు. మరోవైపు జగద్గురు ఆదిశంకరాచార్యుల నిర్వాణ షట్కమ్ నుంచి కొన్ని పదాలను ఈ పాట కోసం వాడుకున్నారు.ఈ పాటను శరత్ సంతోష్, మోహన భోగరాజు, శ్రీనిధి తిరుమల, కాలబైరవతో పాటు కీరవాణి పాడారు. ఈ మూవీలో మొత్తంగా 4 బిట్స్ సాంగ్స్‌తో కలిపి 10 పాటలున్నాయని చెబుతున్నారు. తొందర్లనే ఈ మూవీలో ఉన్న పాటలను త్వరలో రిలీజ్ చేయనున్నారు.షూటింగ్ శరవేగంగా జరపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.