సురేఖావాణి భర్త మరణవార్త విని ఎన్టీఆర్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న కుటుంబ సభ్యులు

150

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్గ్ గా నటించి అందరిచేత షెభాష్ అనిపించుకున్న నటి సురేఖా వాణి. తల్లి, అక్క, భార్య పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సురేఖా వాణి ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లతో నటించి కడుపుబ్బా నవ్వించింది. టీవి సీరియల్స్ లో కెరీర్ ఆరంభించిన ఈమె తర్వాత వెండి తెరపై ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలంటి సురేఖావాణి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సినీ నటి సురేఖా వాణి భర్త సురేష్ తేజ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం ఉదయం చనిపోయారు. భర్త సురేష్ తేజ, కూతురు సుప్రితతో కలిసి హైదరాబాద్ లో జీవిస్తున్నారు.

Image result for surekha vani

సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్న సమయంలోనే సురేష్ పరిచయం అయ్యారు. తర్వాత ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. సురేష్ తేజ డైరెక్షన్‌లోనే మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలకు సురేఖా వాణి యాంకరింగ్ చేశారు. అలాగే ఎన్నో టీవీ కార్యక్రమాలకు సురేష్ దర్శకుడిగా వ్యవహరించారు. తర్వాత టాలీవుడ్ సినిమా ఛానల్ పోగ్రామింగ్ హెడ్‌గా ఉన్నారు. సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఛాన‌ల్ ప్రోగ్రామింగ్ హెడ్‌గా పనిచేస్తున్నారు. సురేఖా వాణి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. అయితే సురేష్ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. పలువురు సురేఖవాణిని పరామర్శిస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ విషయం తెలియగానే ఎన్టీఆర్ దిగ్బంతికి గురయ్యారంట. ఎన్టీఆర్ తో కలిసి సురేఖావాణి ఎన్నో చిత్రాలలో నటించింది. ఆ అనుబంధంతోనే సురేఖవాణికి ఎన్టీఆర్ ఫోన్ చేశాడంట. సురేఖవానికి ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. మీలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి సమస్య రావడం నన్ను ఎంతో కలచివేస్తుంది. మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా ఒక తమ్ముడిలా ఎప్పుడు మీ వెంట ఉంటానంటూ ఎన్టీఆర్ సురేఖను ఓదార్చినట్టు సమాచారం. ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా కానీ శాంతి కలగాలని కోరుతూ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సినిమాలలో నటించినందుకు తనను ఒక తోబుట్టువుల అనుకుని ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు కన్నీళ్లు పెట్టుకుందంట సురేఖావాణి. మరి సురేఖావాణి భర్త మరణవార్త తెలిసి ఎన్టీఆర్ సురేఖవానికి ఫోన్ చేసి మాట్లాడిన విషయం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.