ఎన్టీఆర్ హీరోగా రామ్ చరణ్ నిర్మాతగా సినిమా?

299

రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది.ఇద్దరు ఆప్తమిత్రులు.వీరిద్దరూ కలిసి త్వరలో రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు కూడా.అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఒక వార్త వీరి మధ్య ఉన్న బంధం ఎంత గట్టిదో చెప్పేలా ఉంది.

Related image

రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బేనర్లో తెరకెక్కిన తొలి చిత్రం ‘ఖైదీ నెం. 150’ సంచలన విజయం అందుకోగా ఇపుడు దాదాపు రూ. 150 నుండి రూ. 200 కోట్ల ఖర్చుతో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘సైరా’ లాంటి పీరియడ్ మూవీని కనివీని ఎరుగని రీతిలో నిర్మిస్తున్నారు.అయితే తన సొంత బేనర్లో కేవలం తమ మెగా ఫ్యామిలీ హీరోలతోనే కాకుండా బయటి హీరోలతో కూడా సినిమాలు చేయాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారట.

 మంచి పరిణామం

‘కొణిదెల ప్రొడక్షన్స్’ బేనర్లో చేయబోయే తొలి బయటి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటూ తాజాగా ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది.. రామ్ చరణ్ తన బేనర్లో సినిమా చేయాలని ఎన్టీఆర్‌ను అడగటం, యంగ్ టైగర్ సూచన ప్రాయంగా ఓకే చెప్పడం జరిగిపోయిందట.ఇదే కనుక జరిగితే అటు నందమూరి ఫాన్స్ కు ఇటు మెగా ఫాన్స్ కు పండుగ అనే చెప్పుకోవాలి.