వాయిదా పడిన ‘ఎన్టీఆర్‌’ మహానాయకుడు..రిలీజ్ డేట్ చేంజ్?

276

మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ .క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.బాలయ్య నిర్మిస్తున్నాడు.ఇందులో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా ఎన్టీఆర్ సతీమని బసవతారకం పాత్రలో విద్యా బాలన్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, అక్కినేని పాత్రలో సుమంత్ ,హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Image result for ntr biopic

ఎన్టీఆర్ నట జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడిగా, రాజకీయ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా వెండితెరపై చూపించనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ నట, రాజకీయ జీవితంలో ఆయనతో సంబంధమున్న కీలక పాత్రలను తెరకెక్కించారు.ఈ చిత్రానికి సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది.ఇప్పుడు మరొక వార్త హల్చల్ చేస్తుంది.గతంలో ఈ సినిమా రెండు పార్ట్‌లకు సంబంధించిన రిలీజ్‌ డేట్స్‌ (జనవరి 9, 24)ను ప్రకటించింది చిత్రబృందం.అయితే తాజాగా ఈ సినిమాను కొన్న బయ్యర్లు చేసిన విజ్ఞప్తిని చిత్రయూనిట్‌ పరిగణలోకి తీసుకుందని సమాచారం.

NTR Biopic Second Part May Be postponed  - Sakshi

 

ఈ రెండు పార్ట్‌లకు రెండు వారాలే గ్యాప్‌ ఉంటే నష్టపోయే అవకాశం ఉందని బయ్యర్లు ఆందోళన చేశారని, వారి విజ్ఞప్తి మేరకు రెండో పార్ట్‌ ‘మహానాయకుడు’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. ఇంతకు ముందే ‘మహానాయకుడు’ విడుదల వాయిదా కానుందని ప్రచారం సాగినా.. వాటిపై మేకర్స్‌ రియాక్ట్‌ కాలేదు. మరి ఇప్పుడైనా చిత్రయూనిట్‌ వీటిపైన స్పందించి అధికారికంగా ప్రకటిస్తుందో లేదో చూడాలి.