‘గౌతమి పుత్రను దాటిపోయిన ‘ఎన్టీఆర్’

236

ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ విడుదల అయ్యింది.. భారీ అంచనాల నడుమ ఈ బయోపిక్ మొదటిభాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఈరోజు మన ముందకు వచ్చింది. విడుదల అయినా అన్ని చోట్ల విజయడంకా మోగిస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో ఉన్న ముఖ్య ఘట్టాలను చాలా చక్కగా చూపించారు.

Image result for ntr biopic

అయితే విడుదల అయినా మొదటిరోజే సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది ‘ఎన్టీఆర్ కథానాయకుడు.అమెరికాలో ప్రదర్శించబడిన ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ పరంగా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ని బీట్ చేసింది ‘ఎన్టీఆర్’ మూవీ. నిన్న (మంగళవారం) ఉదయం నుంచి నేటి ఉదయం వరకు ప్రదర్శించబడిన ప్రీమియర్ షోస్ ద్వారా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ 4,40,000 డాలర్లు అంటే సుమారు 3,09,87,000 రూపాయలు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు.

Image result for ntr biopic

ఈ మొత్తం.. ఇదే బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో వచ్చిన గత సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ కంటే ఎక్కువ కావటం విశేషం. అప్పుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా అమెరికాలో వేసిన ప్రీమియర్‌ షోస్ ద్వారా 3,75,000 డాలర్లు అంటే 2,64,14,812 రూపాయలు రాబట్టింది.