తండ్రి మరణాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరు అవుతున్న NTR..

452

సినీ, రాజకీయ రంగంలో పెను విషాదం చోటు చేసుకుంది. సినీ హీరో, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.హైదరాబాద్‌ నుంచి నెల్లూర్ వెళ్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా.. ఆయన శరీరం సహకరించకపోవడంతో కన్నుమూశారని సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.అయితే తండ్రి మరణవార్త విన్న తర్వాత ఎన్టీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అందరికి ఆలోచించేలా చేస్తున్నాయి.

Image result for harikrishna nandamuri car accident images

మరి ఎన్టీఆర్ ఏమన్నాడో చూద్దామా.హరికృష్ణ మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయారు.తండ్రి మరణవార్త విని ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. ప్రమాదవార్త తెలియగానే ఎన్టీఆర్, కల్యాణ్ రాం వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. హాస్పిటల్‌‌లో తండ్రి పార్థీవదేహాన్ని చూసి భోరున విలపించారు. పొంగుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకొంటూ తండ్రి భౌతికకాయాన్ని హైదరాబాద్ తరలించే ఏర్పాట్లలో మునిగిపోయారు.అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరిని ఆలోచించేలా చేస్తున్నాయి.తన సోదరుడు జానకీరాం మృతితో నేను, కల్యాణ్ రాం అన్న చాలా తీవ్ర విషాదానికి గురయ్యాం. అన్నయ్య లేని లోటు తీర్చలేనిదని పలుమార్లు ఆవేదన గురయ్యాం.

Image result for jr ntr

వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నేను కల్యాణ్‌రాం అన్న సూచించేవాళ్ళం.మా అన్న జానకిరాం మృతి తర్వాత విడుదలైన నాన్నకు ప్రేమతో చిత్రంలో వాహనం నడిపేటప్పుడు ఇంటి వద్ద మనకోసం ఎదురుచూసే వాళ్లు ఉంటారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని వాహనదారులకు రిక్వెస్ట్ చేశాం.చాలా మంది నేను చెప్పిన విషయాలను పట్టించుకున్నారు.కానీ మా నాన్న పట్టించుకోకుండా అజాగ్రత్త నడిపి ఇప్పుడు మా అందరికి దూరం అయ్యాడు.కాబట్టి ఇప్పుడు మళ్ళి చెబుతున్నా వాహనం నడిపెసమయంలో జాగ్రత్తలు తీసుకోండి.సీట్ బెల్ట్ పెట్టుకోండి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

లేకుంటే మా కుటుంబంలో జరిగిన విషాదమే మీ కుటుంబంలో కూడా జరుగుతుందని ఎన్టీఆర్ తన తండ్రి మరణవార్తను దిగమింగుకుని అభిమానులకు ఈ సందేశాన్ని చెప్పాడు.ఒకవైపు అన్న మరొకవైపు తండ్రి ఇద్దరు యాక్సిడెంట్ కారణంగానే చనిపోవడం వలన ఎన్టీఆర్, కల్యాణ్ రాం తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు.హరికృష్ణ మృతి నేపథ్యంలో ఎన్టీఆర్, కల్యాణ్ రాంకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచిస్తున్నారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే ఇంత విషాదంలో కూడా ఎన్టీఆర్ చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.