#RRR కోసం భారీగా బరువు పెరిగిన ఎన్టీఆర్..లుక్ వైరల్..

240

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ రెడీ అయ్యింది. బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. రాజమౌళి లాంటి బడా దర్శకుడి చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తుండడంతో ఈ చిత్రం సౌత్ లోనే క్రేజీ మల్టీస్టారర్ గా మారిపోయింది. బాహుబలి చిత్రాన్ని మించేలా 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.

ముంబై హెయిర్ స్టైలిస్ట్

రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలని జక్కన్న ఎలా చూపిస్తాడో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్న పాత్రల గురించి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారట.తాజాగా జూనియర్ ఎన్టీఆర్ భారీ కాయంతో కనిపిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ లుక్ చూసిన అభిమానులంతా షాక్ కి గురవుతున్నారు..

వైరల్ అవుతున్న లుక్

ఈ చిత్రం కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊహకందని విధంగా బరువుపెరుగుతున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్ 100 కేజీల బరువుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పోషించే పాత్ర కోసం భారీ కాయంతో కనిపించాల్సి ఉందట. యమదొంగ చిత్రం కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి ఎన్టీఆర్ తో మరో ప్రయోగం చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.