ఎన్టీఆర్ ఫాన్స్ కు కోపం తెప్పించిన ఆదర్శ్ బాలకృష్ణ…ఏం చేశాడో చూడండి..

366

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద సమేత సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసినదే.ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. నాగబాబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.అయితే ఈ ఆదర్శ్ బాలకృష్ణ ఒక పాత్రను పోషిస్తున్నాడు.అయితే ఆదర్శ్ చేసిన ఒక పని ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ కు కోపం తెప్పిస్తుంది.

‘అరవింద సమేత’ చిత్రంలో అతిథి పాత్ర పోషిస్తున్న ఆదర్శ్ బాలకృష్ణ‌ ఆదివారం షూటింగ్‌కి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఓ ఫొటోని అభిమానులతో ఆదర్శ్ బాలకృష్ణ‌ షేర్ చేసుకున్నాడు.‘ఆదివారం చాలా ప్రత్యేకంగా గడిచింది. అతిథి పాత్రే అయినప్పటికీ.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సార్‌తో కలిసి పనిచేయాలనే కల నెరవేరింది’ అని ఆదర్శ్ బాలకృష్ణ‌ రాసుకొచ్చాడు. ఇక్కడే ఈ టాలీవుడ్ విలన్ కాస్త ఏమరపాటుగా వ్యవహరించాడు.

ఎన్టీఆర్ పేరు పక్కన సార్ లేదా అన్న పదం వాడకపోగా.. త్రివిక్రమ్ పేరు పక్కన సార్ అని వాడటం తారక్ అభిమానులకి కోపం తెప్పించింది. దీంతో ఎన్టీఆర్‌కి మర్యాద ఇవ్వాలంటూ అతడ్ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.చూడాలి మరి దీనికి ఆదర్శ్ ఎలా రియాక్ట్ అవుతాడో.