షాక్: తండ్రి అంత్యక్రియల తర్వాత కళ్ళు తిరిగి పడిపోయిన ఎన్టీఆర్.. అసలేమైంది?

470

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు.నెల్లూరు జిల్లాలో ఓ అభిమాని వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి ఫార్చ్యునర్ వాహనంలో బయల్దేరిన ఆయన నల్లగొండ జిల్లా అన్నెపర్తి దగ్గర ప్రమాదానికి గురయ్యారు. నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.నిన్న సాయంత్రం అంతక్రియలు ముగిసాయి.అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత జరిగిన ఒక ఘటన ఇప్పుడు నందమూరి అభిమానులందరినీ బాధ పెడుతుంది.మరి ఏం జరిగిందో తెలుసుకుందామా..

Image result for harikrishna funeral time

హరికృష్ణ అంత్యక్రియలు నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో జరిగాయి.బరువెక్కిన హృదయాలతో కల్యాణరామ్ తండ్రి చితికి నిప్పంటించాడు.పక్కన సోదరుడు ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.నందమూరి కుటుంబం మొత్తం ఈ అంత్యక్రియలలో పాల్గొన్నది.అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత జరిగిన ఒక ఘటన ఇప్పుడు అభిమానుల మనసులను కలచివేస్తుంది.అసలేం జరిగింది అంటే..హరికృష్ణ చనిపోయాడు అని తెలిసినప్పటి నుంచి అటు తారక్ గానీ ఇటు కళ్యాణ్ రామ్ గానీ పచ్చి మంచినీళ్లు ముట్టుకోలేదు.తండ్రి తమను వదిలేసి పోయాడని బాధలో రెండు రోజులు ఏమి తినలేదు.రెండు రోజుల నుంచి వారి కళ్ళలో నీళ్లు వస్తూనే ఉన్నాయి.దీంతో అన్నదమ్ములిద్దరూ బాగా నీరసించిపోయారు.

Image result for harikrishna funeral time

అంత్యక్రియల సమయంలో కూడా ఇద్దరు ఏడుస్తూనే కనిపించారు.అయితే హరికృష్ణ చితికి నిప్పంటించిన తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.తండ్రి మరణం ఒకవైపు బాధపెడుతుంటే రెండు రోజులు ఏమి తినకపోయేసరికి బాగా నీరసించిపోయాడు.దీంతో చితికి నిప్పంటించిన తర్వాత బయటకు వస్తున్న సమయంలో ఎన్టీఆర్ కళ్ళుతిరిగిపడిపోయాడు..పక్కనే ఉన్న కళ్యాణ్ రామ్ కు ఒక్కనిమిషం ఏం జరిగిందో అర్థం కాలేదు.వెంటనే తేరుకుని అంబులెన్స్ ను పిలిపించారు.కళ్యాణ్ రామ్ తన చేతులతో ఎన్టీఆర్ ను ఎత్తుకుని అంబులెన్స్ దగ్గరకు తీసుకెళ్లాడు.. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం బయటపడింది.

అయితే వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో ఎలాంటి నష్టం జరగలేదు.రెండు రోజుల నుంచి ఏమి తినలేదు కాబట్టి కళ్ళుతిరిగిపడిపోయాడని డాక్టర్స్ చెప్పారు.ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు హాస్పిటల్ దగ్గరకు వెళ్లి నానా రచ్చ చేశారు.ఎన్టీఆర్ కు ఏమి కాలేదని తెలుసుకుని ప్రశాంతంగా వెనుదిరిగారు.విన్నారుగా హరికృష్ణ అంత్యక్రియల తర్వాత జరిగిన ఘటన గురించి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే అంత్యక్రియల తర్వాత ఎన్టీఆర్ కుప్పకూలిపోయిన ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.