మిస్టర్ మజ్ను చిత్ర ఈవెంట్ కు ముఖ్య అతిధి ఎన్టీఆర్

220

యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ మూడో సినిమాకు ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ ఖరారైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిధి అగర్వాల్‌ కథానాయికగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా తమన్‌ బాణీలు అందిస్తున్నారు.

Related image

ఈ చిత్రంలో ఆయన లవర్‌ బాయ్‌లా కనిపించారు.గత చిత్రాలతో పోల్చితే ఇందులో అఖిల్‌ లుక్‌, పాత్ర చాలా విభిన్నంగా ఉన్నాయి. ఈ చిత్రంలో అఖిల్‌ ప్లేబాయ్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే విడుదల చేసిన చిత్ర పోస్టర్స్ టీజర్స్ పాటలు చిత్రం మీద భారీ అంచనాలు వచ్చేలా చేశాయి. మొదట ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలని భావించారు. జనవరిలో భారీ చిత్రాల విడుదల ఉండడంతో మిస్టర్ మజ్ను చిత్రం వాయిదా పడింది.

అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. జనవరి 19న సాయంత్రం ఆరుగంటలకు హైదరాబాద్‌లో జరుగనున్న ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ హాజరుకాబోతున్నారని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.